‘బిగిల్’ ఖాతాలో మరో రికార్డ్ – రెండు యూరోపియన్ కంట్రీస్ లో రిలీజ్..! 

Bigil Movie Sets A New Record By Simultaneously Releasing Both In Germany and France On Thalapathy Vijay Birthday

అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’ అనే పేరుతో గత ఏడాది దీపావళి కి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అట్లీ-విజయ్ కాంబినేషన్ లో మెర్సల్‌, సర్కార్‌ సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మూడోసారి వచ్చిన బిగిల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకున్నారు. అంతేకాదు రూ.200 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా మరో రికార్డు ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను రెండు యూరోపియన్ కంట్రీస్ లో రిలీజ్ చేయనున్నారు. జూన్ 21 న ఈ సినిమా తమిళ్ వెర్షన్ జర్మనీలో, జూన్ 22 న ఫ్రాన్స్ లో రిలీజ్ కానుంది. దీనితో తమ అభిమాన హీరో సినిమా అక్కడ రిలీజ్ అవుతుండటంతో విజయ్ అభిమానులు ఆనందంలో మునిగి తెలుతున్నారు.

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ ‘మాస్టర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. లాక్ డౌన్ వల్ల ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే లాక్ డౌన్ లో కూడా సినిమా అప్ డేట్స్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరటనిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. మరి ఇటీవలే బిగిల్ సినిమాతో హిట్ కొట్టిన విజయ్.. ఈ సినిమాతో ఎంత హిట్ కొడతాడో చూడాలి…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =