కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 172

షూటింగ్ అప్‌డేట్

ఆగష్ట్ లో మొదలుపెట్టడానికి చూస్తున్న నితిన్..!

''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చి సూపర్ హిట్ టాక్ కొట్టాడు.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మీ అందరికీ పెద్ద థ్యాంక్స్..!

ఇంద్రగంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, నివేదా ధామస్, సురభి, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో వచ్చిన వచ్చిన జెంటిల్ మెన్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో నటి హీరోగా అలాగే నెగిటివ్ షేడ్ చేసిన నటన, సంగీతం, అన్నిటికీ మించి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే ఉండటంతో సూపర్ హిట్ అయింది. ఇంకా ఈ ఇసినిమా 2016 జూన్ 17 రిలీజ్ అవ్వగా ఈరోజుతో నాలుగు సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

వచ్చే ఏడాదే అంటున్న బాలకృష్ణ..!

లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుండి ఈ సినిమా షూటింగ్స్ కు అనుమతులు వచ్చినా ఇప్పుడప్పుడే షూటింగ్ లకు వెళ్లే ఆలోచనలో మాత్రం ఎవరికీ లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే.. లాక్ డౌన్ లో సడలింపులు చేయడం.. రోజు రోజుకు కేసులు కూడా పెరగడమే దీనికి కారణం. మరోవైపు షూటింగ్స్ చేయాలంటే పలు నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రం షూటింగ్లను మొదలుపెట్టాలని చూస్తున్నారు... కొంతమంది మాత్రం లేట్ అయినా పర్లేదు అని వెనక్కి తగ్గుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మంచు లక్ష్మీ కూతురికి ప్రభాస్ సర్ ప్రైజ్..!

మంచు మోహన్ బాబు, కృష్ణం రాజు ఫ్యామిలీస్ కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణకు సర్ ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ పుట్టినరోజు వేడుకలు తన ఇంట్లో సింపుల్‌గా జరిగిపోయాయి. ఈ సందర్భంగా విద్యా నిర్వాణకి ప్రభాస్ వీడియో కాల్ చేసి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడట. అంతేకాదు మంచు లక్ష్మీ ఫ్యామిలీతో చాలాసేపు మాట్లాడట. ఇక ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా తెలియచేసింది. ప్రభాస్ మమ్మల్ని సర్పైజ్ చేసాడని.. ప్రభాస్ కాల్ కు నిర్వాణ మురిసిపోయింది అని తెలిపింది. దీనితో ప్రభాస్ మరోసారి…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రవి బాబు షూటింగ్ ఎక్స్ పీరియన్స్

ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు రవి బాబు తన స్వంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నూతన తారాగణం తో రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "క్రష్ " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు ముందు కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "క్రష్ " మూవీ3నెలల లాక్ డౌన్ తరువాత తెలంగాణ ప్రభుత్వం అనుమతి తో షూటింగ్ ప్రారంభమయింది. లాక్ డౌన్ తరువాత షూటింగ్ జరుపుకుంటున్న మొదటి సినిమా "క్రష్ ".

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మీ త్యాగానికి మా సెల్యూట్..!

లఢక్ లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఇండియా మరియు చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు మరో 19 మంది భారత జవాన్లు మృతిచెందినట్లు ఆర్మీ ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తూ చైనా వైఖరిపై మండిపడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ట్వీట్లతో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌, నిఖిల్‌ సిద్దార్థ‌, అనిల్‌ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, లక్ష్మీ మంచు, వరుణ్‌ తేజ్‌, అనిల్‌ రావిపూడి, తదితరులు వీరజవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"ఉప్పెన" మూవీ పై సాయి తేజ్ స్పందన

మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఉప్పెన" మూవీ సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నిఖిల్ భావోద్వేగం

భారత్ , చైనా బోర్డర్ లద్ధాఖ్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. వారిలో సూర్యాపేట కు చెందిన కర్నల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ , వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియా , చైనా బోర్డర్ లో జరిగిన సంఘటనకు రక్తం మరిగిపోతుందని, చైనా వస్తువులు బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే సోషల్ మీడియా కు దూరం - ఇప్పుడు విస్కీ ఒక‌టే ఉంది..!

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీస్ సడెన్ గా సైలెంట్ అయితే నెటిజన్స్, ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలు పెడతారు. అంతేకాదు పలు వార్తలు కూడా వచ్చేస్తాయి. గతంలో సమంత కూడా కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఇంకేముంది ఏకంగా సమంత ప్రెగ్నెసీ అనే వార్తలు రాసేశారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కు కూడా అలానే జరిగింది. ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ ... ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ యాక్టీవ్ గా ఉండేఅనుపమ.. గత కొన్ని రోజులుగా త‌ను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. అయితే దీనికి కార‌ణం ఏంటో చెబుతూ ఓ వీడియోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి, రామ్ చరణ్ ల స్టైలిష్ ఫైట్ ?

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ క్వారంటైన్ హాబీ

వరుస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీ వుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ తరువాత దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ , ప్రశాంత్ నీల్ చిత్రాలకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యూచర్ లో 'పెదరాయుడు' సీక్వెల్..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఐకానిక్ సినిమా పెదరాయుడు రీసెంట్ గానే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు పెదరాయుడు సినిమా సీక్వెల్ తెరపైకి వచ్చింది. దీనికి కారణం త్వరలో మోహన్ బాబు ఒక ఫ్యామిలీ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పడమే. నిజానికి చాలా సంవత్సరాల క్రితమే పెదరాయుడు సినిమాకు సీక్వెల్‌ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించాడు. అయితే ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఇక ఇప్పుడు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సరైన అమ్మాయి ఇంకా దొరకలేదు..!

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ చిన్నగా ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతుంది. ఆ లిస్ట్ లో అందరికంటే ముందున్న రానా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇక నిఖిల్ ఇప్పటికే పెళ్లి చేసేసుకున్నాడు. నితిన్ పెళ్లి కూడా ఎప్పుడో అయిపోవాలి కానీ కరోనా వల్ల లేట్ అయింది. ఇక రీసెంట్ గా సాహో డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా తన పెళ్లి గురించి చెపుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తండ్రి గురించి రష్మిక ఎమోషనల్ పోస్ట్..!

లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్స్ కు కూడా లేకపోవడంతో సోషల్ మీడియా కు దగ్గరకు ఉంటున్నారు. ఇక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తుంది. తాజాగా తన తండ్రి గురించి రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒక అమ్మగా ఫెయిల్ అయ్యాను..!

సమంత సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటదన్న సంగతి తెలిసిందే. తన సినిమాల గురించి, తాను చేసే పనులు గురించి, అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఏదో ఒక విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఈ మధ్య కాస్త సోషల్ మీడియాకు దూరంగా వున్నా మళ్ళీ యాక్టీవ్ మోడ్ లోకి వచ్చేసింది. ఇక ఈ లాక్ డౌన్ లో ఇంట్లోనే వుంటూ కాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇక తన పెట్స్ ఆడుకుంటూ.. గార్డెనింగ్ చేస్తూ, వంటలు నేర్చుకుంటూ బిజీ అయిపోయింది. ఇక తాజాగా సమంత సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ చేయగా అది నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది. అదేంటంటే.. తన పెట్ హాష్ టాయ్ ను దొంగిలించిందని.. నేను ఒక అమ్మగా ఫెయిల్ అయ్యాను.. మై సన్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాజీ నక్సలైట్ దగ్గర 'భారతక్క'‌ ట్రైనింగ్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి సాయి పల్లవి, ప్రియమణి ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చరణ్ ను పరిచయం చేయడానికి భయపడ్డా..!

స్టార్ హీరోల కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం అంటే డైరెక్టర్స్ కు అంత ఈజీ పని కాదు. అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వాలి. అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో తెలీదు.. అలా వాళ్ళకి కావాల్సిన అన్ని ఎలిమింట్స్ వుండేలా చూసుకొని.. హీరోని పరిచయం చేస్తారు. ఇక హీరో భవిష్యత్తు అనేది తర్వాత తాను చేసే సినిమాలపై ఆధారపడి ఉంటుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ కు సిద్ధంగా లేను - కీర్తి సురేష్

సక్సెస్ ఫుల్ "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ స్వంతం చేసుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి నటించిన "మిస్ ఇండియా "(తెలుగు ), "మరక్కార్ "(మలయాళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "గుడ్ లక్ సఖి ", "రంగ్ దే ", "అన్నాత్తే (తమిళ ) మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది. "మనందరం జీవితంలోని సమస్యలను మనకు తెలిసిన విధంగా పరిష్కరించుకుంటాం. ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. ఇది మంచి మార్గం, ఇది చెడు మార్గం అంటూ లేవు. మనమెవరం రోడ్ మ్యాప్‌తో పుట్టలేదు. మనందరం పెద్దవో, చిన్నవో బాధలు పడుతుంటాం. కొందరు లోపలే కుమిలిపోతారు. కొందరు సాయం కోసం ఏడుస్తారు. కొందరు నిస్సహాయంగా ఉంటారు. ఇకపై మనం ఇంకా దయతో జీవిద్దాం. ఇతరుల మాటలను విందాం. వారిని ప్రేమిద్దాం. మనమంతా కలిసి ఇంకా ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. మనం ఇప్పటికప్పుడు ప్రతి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియా లో బర్త్ డే శుభాకాంక్షలు

"ఫొటో " తెలుగు మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అంజలి దక్షిణాది భాషలన్నింటిలోనూ పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అంజలి కీలక పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్

షేర్