ఫైనల్లీ.. కాబోయే భర్తను చూపించిన నిహారిక..!మొత్తానికి తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది మెగా డాటర్ నిహారిక కొణిదల. గతకొద్దికాలంగా నిహారిక పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. తండ్రి నాగబాబు కూడా త్వరలోనే పెళ్లి చేసేస్తామని చెప్పారు.. తను కూడా ఇంకా తక్కువ టైమే ఉంది అంటూ హింట్స్ ఇస్తూనే ఉంది. ఫైనల్లీ ఇప్పుడు ఆ టైం రానే వచ్చేసింది. నిన్న సోషల్ మీడియాలో మిస్ట్రెస్.. అంటూ.. మొహం కనిపించకుండా క్యూరియాసిటీని పెంచిన నిహారిక… తాజాగా తనకు కాబోయే భర్తను చూపించేసింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత సినీ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు కూడా నిహారికకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అబ్బాయి విషయానికొస్తే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. చైతన్య గుంటూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి కొడుకుగా తెలుస్తుంది. ఇక ఆగష్ట్ నిహారిక, చైతన్యల నిశ్చితార్థం జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
ఇక ఇప్పటికే ఈ ఏడాది రానా, నితిన్ లాంటి వాళ్లు కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు నిహారిక కూడా పెళ్లి కూతురు కాబోతుంది. మొత్తానికి 2020 టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళకి మాత్రం బాగా కలిసొచ్చింది.
ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది నిహారిక. గతంలో ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక కొణిదెల. ఇప్పుడు తాజాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. పూర్తి స్థాయి కామెడీతో ఈ సినిమా తెరకెక్కబోతునన్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: