కంటతడి పెట్టిస్తున్న ‘చిరంజీవి సర్జా’ భార్య ‘మేఘనా రాజ్’ లేఖ..!

Meghna Raj's Heart Warming Letter About Her Husband Chiranjeevi Sarja Will Leave Us In Tears
Meghna Raj's Heart Warming Letter About Her Husband Chiranjeevi Sarja Will Leave Us In Tears

కన్నడ యంగ్ హీరో, ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్‌ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతి చెందారు. ఇక చిరంజీవి సర్జా మృతితో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా భార్య మేఘనా రాజ్ కు మాత్రం కోలుకోలేని దెబ్బ. చిరంజీవి స‌ర్జా 2018 మే 2న మేఘ‌నా రాజ్‌ను వివాహ‌మాడారు. పెళ్ళైన రెండేళ్లకే ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరం. ఇక తాజాగా చిరంజీవి సర్జా గురించి సోషల్ మీడియాలో తాను చేసిన పోస్ట్ ఒకటి నెటిజన్లకు కంటతడి పెట్టిస్తుంది. ఆ లేఖ చూస్తుంటే చిరంజీవి సర్జాను తను ఎంతగా ప్రేమించిందో, ఏం కోల్పోయిందో అర్ధమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“చిరు.. నీకు ఎన్నో విషయాలను చెప్పాలని ఉంది. కానీ ఎలా చెప్పాలో ఎంత ప్రయత్నించినా తెలియడం లేదు. నువ్వు నాకు ఎంత ముఖ్యమో ఈ ప్రపంచంలో దేనితో వర్ణించలేను. ఫ్రెండ్‌వి, ప్రేమికుడివి, జీవిత భాగస్వామివి, నాకు చంటి పిల్లాడివి, నా ధైర్యానివి.. ఇలా ఏదని చెప్పను. వీటన్నింటి కంటే నువ్వు నాకు ఎక్కువే. నువ్వే నా ప్రాణం. కానీ ఏదో బాధ అర్థం కావడం లేదు కానీ ప్రతీక్షణం కృంగదీస్తోంది. నువ్వ లేవని తలుచుకుంటేనే చిత్రవధలా ఉంది. వేల రెట్లు నరకం అనుభవిస్తున్నంత బాధగా ఉంది. నా చుట్టూ ఏదో వలయం అల్లుకున్నట్లుంది. నేను బాధపడుతున్న పతిసారి నువ్వు నా చుట్టూనే ఉన్నావనే ఫీలింగ్ కలుగుతుంది.. న‌న్ను ఎంత‌గానో ప్రేమించావు.. ఎప్ప‌టికీ నా చేయి వ‌ద‌ల‌నంటూ మాటిచ్చావు. కానీ ఏం చేశావు? మ‌న ప్రేమ‌కు గుర్తుగా నాకు పాపాయిని ఇస్తున్నందుకు నీకు చిర‌కాలం కృతజ్ఞ‌త‌లు తెలుపుతూనే ఉంటాను. మ‌న‌ బిడ్డ‌గా నిన్ను మ‌ళ్లీ భూమిపైకి తీసుకువ‌చ్చేందుకు నేను త‌హ‌త‌హలాడుతున్నాను. నీతో క‌లిసి బ‌తికేందుకు ఎదురు చూస్తున్నాను” అంటూ లేఖలో పేర్కొంది. ఇక ఈ లేఖను చూసిన వారందరూ కన్నీటిపర్యంతమవుతున్నారు.


కాగా మొదట అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన చిరంజీవి సర్జా..ఆ తర్వాత నటుడిగా మారి 2009లో ‘వాయుపుత్ర’ అనే చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సర్జా ‘చిర్రు’, ‘చంద్రలేఖ’, ‘ఆటగర’, ‘భార్జరి’, ‘సీజర్’, ‘అమ్మ ఐ లవ్ యు’, ‘సింగా’, త‌దిత‌ర సినిమాల్లో నటించారు. ఆయన ఆఖరి సినిమా ‘శివార్జున’. తన కెరీర్‌ మొత్తంలో 19 సినిమాలు చేస్తే అందులో 14 చిత్రాలు రీమేక్‌లే కావడం గమనార్హం. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అందులో ఒక సినిమాకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతుండగా, మూడు సినిమాలు షూటింగ్ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు నిర్మాతలు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =