హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటిక విష్ణు, కాజల్ ఫస్ట్, సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ డిఫరెంట్ గా అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రేపు కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో మంచు విష్ణు, కాజల్ ఇద్దరూ అర్ధనారీశ్వరం అవతారంలో అంటే సగం మంచు విష్ణు ముఖం.. సగం కాజల్ ముఖం వుంది. ఇక ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో విష్ణు అర్జున్ పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అను పాత్రలో నటిస్తుంది. కాగా నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది.
Happy Birthday to my amazing talented @MsKajalAggarwal! Keep rocking girl with those sexy big eyes! Muah, Anu! #Mosagallu @SunielVShetty @theleapman @ruhisingh11 @pnavdeep26 @naveenc212 @sheldonchaudp pic.twitter.com/xEUyRnwfnO
— Vishnu Manchu (@iVishnuManchu) June 18, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: