ట్వీట్ తో క్యూరియాసిటీ పెంచిన ‘కె.జి. ఎఫ్ 2’ డైరెక్టర్..!

Director Prashanth Neel Tweet On KGF 2 Movie Takes Audience Expectations To Sky High Level

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కె.జి.ఎఫ్ సినిమా మాములు రికార్డులు సృష్టించలేదు. తెలుగు, కన్నడ, హిందీ లో ఈ సినిమా స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఇక ‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచనాలు పెంచుకున్నారు అభిమానులు. ఇక అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పెట్టకూడదన్న నేపథ్యంలో ఈ సినిమా అవుట్ ఫుట్ కోసం కోసం చిత్ర యూనిట్ అదే రేంజ్ లో కష్టపడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఫ్యాన్స్ ఎదురుచూపులకు కరోనా ఒకరకంగా అడ్డుకట్ట వేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే.. కరోనా లేకపోయిఉంటే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉండేది. కానీ పరిస్థితి వేరు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ చేసిన ఒక ట్వీట్ మాత్రం మరింత క్యూరియాసిటీ నిపెంచుతుంది. తన ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్ట్ చేస్తూ.. ఏం జరుగుతుందో గెస్ చేయండి అంటూ ట్వీట్ చేసాడు. మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా అప్పుడే గెస్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది ప్రమోషన్స్ గురించి అంటుంటే.. మరికొంత మంది రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుంటున్నారేమో అని అంటున్నారు. మరి అదేంటో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మరి సినిమా రిలీజ్ విషయంలో కూడా నిర్మాత కార్తీక్ గౌడ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 23న విడుదల చేస్తామని అన్నారు. మరి అక్టోబర్ లో అంటే అప్పటికి థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదు కాబట్టి ఏం చేస్తారో చూడాలి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.