4 నెలలపాటు చాతుర్మాస్య దీక్ష తీసుకున్న పవన్..!

Powerstar Pawan Decided To Take Deeksha For 4 Months

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఎన్నో విధాలుగా నష్టపోయింది. ఎంతోమంది జీవనోపాధి కోల్పోయారు. ఎంతో మంది తినడానికి తిండి లేక అల్లల్లాడుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితులు నుండి బయటపడాలని పవన్‌ కళ్యాణ్‌ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. దాదాపు నాలుగు నెలల పాటు ఈ దీక్ష చేయనున్నారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీఇజమాసం కలిసి నాలుగు మాసాల పాటు ఈ దీక్ష కొనసాగుతుందట. ఒకటి కాదు రెండు కాదు పవన్ దాదాపు 20 సంవత్సరాలునుండి పవన్ ఈ ఈ దీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. నాలుగు నెలలు పాటు దీక్షను చేసిన తర్వాత.. ఆఖరిగా హోమాన్ని నిర్వహించి విరమిస్తారు.ఇక ఈ దీక్షలో ఉన్ననంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటారని, శాకాహారం మాత్రమే తింటారని చెపుతున్నారు. అది కూడా ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటాడట.

కరోనా వైరస్ పట్టి పీడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. కులవృత్తులను నమ్ముకుని జీవిస్తోన్న స్వర్ణ కారులు, నేత కార్మికులు, కళాకారులు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దుర్భర పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడి సాధారణ జీవనం సాగించాలని, వారికి శారీరక, మానసిక ఆరోగ్యం అందించాలని భగవంతుడిని కోరుకుంటూ ఈసారి దీక్ష చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ తన మనోభీష్టం చెప్పారని జనసేన అధినేత రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ తెలిపారు.

పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here