థియేటర్స్ స్టాఫ్ కోసం ముందుకొచ్చిన మెగా ఫ్యాన్స్..!

Mega Star Fans Come Forward To Help Theater Workers

గత నాలుగు నెలల నుండి కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందొ చూస్తూనే ఉన్నాం. ఇక ఈలాక్ డౌన్ అందరికీ ఏమో కానీ పేదలకు మాత్రం ఒకరకంగా శాపంగా గా మారిందనే చెప్పొచ్చు. ఇప్పటికే సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల వరకూ ఎవరికి తోచింది వారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంత మంది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే.. కొంత మంది నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. ఇక మెగా స్టార్ కూడా సినీ కార్మికుల కోసం ఇప్పటికే చిరు కరోనా వైరస్ చారిటీ పేరుతో విరాళాలు సేకరించి వారికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మరోసారి ముందుకొచ్చారు. సినీ కార్మికులకు ఏదోలా సాయం అందుతుంది కానీ థియేటర్ కార్మికులకి మాత్రం అంతగా సాయం అందట్లేదని చెప్పొచు.. ఈ నేపథ్యంలోనే చిరు ఫ్యాన్స్ ఓ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే చిరు పుట్టిన రోజు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక చిరు పుట్టినరోజుకు ఫ్యాన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈసారి థియేటర్స్ కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించారట. మూడు నెలలకు పైగా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూత పడగా, ఆ పరిశ్రమపై ఆధారపడిన చిరుద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారు. దీనితో థియేటర్స్ కార్మికులను ఆదుకొని వారికి సాయం చేయాలని నిర్ణయిచుకున్నారు. ఈ మేరకు వారు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =