ఛాలెంజింగ్ రోల్స్ ఇష్టం – కాజల్ అగర్వాల్

I Would Love To Play Challenging Roles Says Tollywood Star Heroine Kajal Aggarwal

తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో మెడిటేషన్ , యోగా , వర్కౌట్ , టీవీ లో రామాయణం , మహాభారతం సీరియల్స్ చూస్తూ , భగవద్గీత, భాగవత పురాణాలు పఠిస్తూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ, ఆన్ లైన్ క్లాసెస్ కు అటెండ్ అవుతూ కాజల్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “, “ఇండియన్ 2”, “హేయ్ సనమిక (తమిళ ), “ముంబై సాగ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. రియల్ లైఫ్ లో కానీ రీల్ లైఫ్ లో కానీ ఎదురయ్యే ప్రతీ సమస్యను ఒక సవాలుగా తీసుకొంటానని, బలహీనతగా ఎప్పటికీ మార్చుకోనని , ఎప్పుడైనా ఒక పనిని చూసి భయపడి వదిలివేయడమో , దూరం గా పారిపోవాలని ప్రయత్నిస్తేనో అది మన బలహీనతగా మారుతుందని , తాను అటువంటి స్థితి లో ఉండాలని కోరుకోనని , ఛాలెంజింగ్ పాత్ర ఉన్న మూవీస్ నే ఎంపిక చేసుకొనడం తనకు ఇష్టమని , సినీ కెరీర్ లో మూవీస్ చిత్రీకరణ సమయం లో పలు ఇబ్బందులు ఎదురయ్యాయని, అవన్నీ తన కెరీర్ లో మధుర జ్ఞాపకాలని కాజల్ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here