సింగిలా?.. రిలేషనా? ఇలియానా సూపర్ కౌంటర్

Actress Ileana Gives A Funny Counter To An Audience Question On A Live Interview

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్.. గోవా బ్యూటీ ఇలియానా. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించి చాలా కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో కూడా ఈ అమ్మడు బాగానే యాక్టీవ్ గా ఉంటది. తన ఫొటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటది. ఇక లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమవ్వగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే వుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలియానా కూడా తాజాగా కాసేపు అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు తెలిపింది. ఇక ఈ సందర్భంగా.. ఒక అభిమాని మీరు సింగిల్ ఆ రిలేషన్ షిప్ లో ఉన్నారా అంటూ ప్రశ్న అడగగా దానికి ఇలియానా చిన్న కౌంటర్ ఏ ఇచ్చింది. మనకు పక్కన వాళ్ళ అఫైర్స్ గురించి తెలుసుకోవాలంటే చాలా క్యూరియాసిటీ ఉంటుంది అని రిప్లై ఇచ్చింది.

అయితే అప్పట్లో ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ మెంటైన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు బ్రేకప్ అయిందనుకోండి. తన ప్రియుడితో విడిపోయినట్లు తానే తెలిపింది. ప్రస్తుతం సింగిల్ గానే వుంటూ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.

ప్ర‌స్తుతం ది బిగ్‌బుల్ పేరుతో రూపొందుతున్న ఓ హిందీ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది. ఇక తెలుగులో నాగార్జున హీరోగా `గ‌రుడ‌వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాలో నాగార్జున స‌ర‌స‌న ఇలియానా న‌టించ‌నుంద‌ని స‌మాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =