దర్శకుడు రవిబాబు ఫీలింగ్స్

Tollywood Director Ravi Babu Finds It Difficult To Shoot Movie Scenes Following All Government Guidelines

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు రవిబాబు తన స్వంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పై నూతన నటీ నటులతో “క్రష్ ” మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ ముందే 90శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. లాక్ డౌన్ సడలింపుతో షూటింగ్ జరుపుకున్న మొదటి చిత్రం “క్రష్ “. 26 మంది యూనిట్ మెంబర్స్ తో దర్శకుడు రవి బాబు టాకీ పార్ట్ కంప్లీట్ చేశారు. సాంగ్స్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా రవి బాబు తన మనసులో మాట ను వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో , ప్రభుత్వ ఆంక్షలతో షూటింగ్ జరపడం కష్టం అని, లవ్ స్టోరీ మూవీ లో ఇంటిమేట్ సీన్స్ , కుటుంబ కథా చిత్రాలలో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని మాట్లాడుకొనే సీన్స్ తెరకెక్కించలేమని , ఈ పరిస్థితులలో షూటింగ్ జరపడం కంటే ఇంట్లో ఉండటమే ఉత్తమం అని రవి బాబు చెప్పారు. దర్శకుడు రవి బాబు మాటలను బట్టి చిత్ర పరిశ్రమ రాబోయే రోజులలో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొనేలా ఉందనడంలో సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 6 =