ట్రోల‌ర్స్‌పై పోలీసులకు త‌రుణ్ భాస్క‌ర్ ఫిర్యాదు..!

Pelli Choopulu Director Tharun Bhascker Lodges A Police Complaint Against Online Trollers

సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై అప్పుడప్పుడు కామెంట్లు రావడం చూస్తూనే ఉంటాం. వాటికి వాళ్ళు కూడా అప్పుడప్పుడు రివర్స్ కౌంటర్ లు కూడా ఇస్తుంటారు. ఇక పరిస్థితి మరీ శృతి మించితే పోలీస్ ఫిర్యాదు ఇవ్వక తప్పదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కి. దానికి కారణం ఓ మలయాళ సినిమానే కారణం.

ఇటీవల తరుణ్ భాస్కర్ కపేలా అనే మలయాళ సినిమాను చూసి దానిపై ప్రశంసలు కురిపించాడు. సినిమాలో అర‌వ‌డాలు లేవు, మాస్ అప్పీల్ లేదు అలాగే తెలుగు సినిమాల్లో ఉండే అనవసరమైన కమర్షియల్‌ డ్రామా అందులో ఉండదని అన్నాడు. దీనితో ఓ హీరో అభిమానులు ఆయనకు వ్యతిరేంగా సోషల్‌ మీడియాలో విమర్శలకు దిగారు. ఈ విమర్శలపై త‌రుణ్ భాస్క‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కొంద‌రు త‌న‌ను తిట్ట‌డంతో పాటు బెదిరించార‌ని ఫిర్యాదులో పేర్కొన్న త‌రుణ్‌, త‌న‌ను వేధించిన వారు ఫోన్ నెంబ‌ర్స్, ఐడీ నెంబ‌ర్స్‌ను పోలీసుల‌కు ఫిర్యాదుతో పాటు అందించారు. తాను కంప్లైంట్ చేసిన విష‌యాన్ని కూడా త‌రుణ్ భాస్క‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

ఒక సినిమా విషయంలో గత కొద్ది రోజులుగా కొందరకు నన్ను, నా టీమ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో నేను సైబర్‌ క్రైమ్‌ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరి వివరాలు వారికి అందజేశాను. ఇందుకు సంబంధించి తొలుత మేము వారిని పిలిచి మాట్లాడాం. ట్రోలింగ్‌ అనేది ఇతరుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించాం. అలాగే వ్యక్తిగత దూషణ అనేది తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించాం. కానీ వారు దీనికి సానుకూలంగా స్పందించలేదు. దీంతో మా వద్ద ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించాం. దీనిని మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం.. మాపై తప్పుడు వ్యాఖ్యలు, పోస్ట్‌లు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here