అల్లరి సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన నరేష్ ఇప్పటివరకూ మ్యాగ్జిమమ్ కామెడీ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాడు. తనకంటూ సెపరేట్ రూట్ ను క్రియేట్ చేసుకున్నాడు. మధ్యలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించాడు. గమ్యం, శంభో శివ శంభో సినిమాల్లో ఇటీవలే వచ్చిన మహర్షి సినిమాలో కూడా ఫ్రెండ్ పాత్రలో నటించి తన నటనలో ఉన్న మరో యాంగిల్ ను కూడా చూపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తన రూట్ ను మార్చాలనుకుంటున్నాడు. ‘నాంది’ అనే సినిమాతో తన నట ప్రస్థానానికి కొత్తగా నాంది పలుకుతున్నాడు నరేష్. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇప్పటి వరకు నరేశ్ చేసిన చిత్రాలన్నింటిలో ఈ సినిమా డిఫరెంట్ అని టీజర్‌ను చూస్తేనే అర్థమవుతుంది. అంతేకాదు టీజర్ ను చూసిన ప్రతి ఒక్కరూ నరేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ టీజర్‌పై అల్లరి నరేష్ స్నేహితుడు నాని కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. `అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు. `నాంది` సినిమా కోసం వెయిట్ చేస్తున్నా` అంటూ నాని ట్వీట్ చేశాడు.
Adhirindhi ra .. happy birthday to you and to your brand new avatar 🤗
Looking forward to this one #Naandhi #Naresh57 @allarinaresh https://t.co/tR2TJwtzst— Nani (@NameisNani) June 30, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: