రవితేజ కు జోడీగా రాశీఖన్నా ?

Actress Raashi Khanna Once Again To Pair Opposite Ravi Teja After Touch Chesi Chudu

తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 3 తమిళ మూవీస్ లో నటిస్తున్న రాశీఖన్నా ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. లాక్ డౌన్ సమయంలో బుక్ రీడింగ్, యోగా , తమిళ భాష ను నేర్చుకొంటూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ రాశీఖన్నా టైమ్ పాస్ చేస్తున్నారు.

సక్సెస్ ఫుల్ “నేను లోకల్ ” మూవీ ఫేమ్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరో గా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం. రవితేజ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ ” మూవీ తరువాత దర్శకుడు త్రినాధరావు మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది . రవితేజ , రాశీఖన్నా కాంబినేషన్ లో “బెంగాల్ టైగర్ “, “టచ్ చేసి చూడు ” మూవీస్ రూపొందాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here