ప్రత్యర్థులుగా తండ్రీ కొడుకులు..!

Tamil Actor Chiyaan Vikram and His Son Dhruv To Play Rival Roles In Their Upcoming Movie With Karthik Subbaraj

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విక్రమ్-ధృవ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో విక్రమ్‌ వయస్కుడైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినపడుతుంది. ఈ సినిమాలో విక్రమ్-ధృవ్ ఇద్దరూ ప్రత్యర్థులుగా కనిపించనున్నారట. అంతేకాదు విక్రమ్ పాత్ర నెగెటివ్ షేడ్ లో షేడ్ లో ఉండనుందట. మరి ఇందులో ఎంతో నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం కార్తీక్ జగమే తందిరం సినిమా చేస్తున్నాడు. మరోవైపు అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే చిత్రంలో నటిస్తున్నాడు విక్రమ్. ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత తమ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eleven =