ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 163
దర్శకుడు రాజమౌళి పై తమన్నా ప్రశంసలు

''12 O క్లాక్'' తో భయపెడతా అంటున్న వర్మ..!
నిహారిక ఎంగేజ్ మెంట్ డేట్ అప్పుడే..?
పవన్ కళ్యాణ్ కు జోడీగా తమన్నా ?
గోపీచంద్ సాహస నిర్ణయం
"దృశ్యం 2" మూవీ అప్ డేట్
రకుల్ ప్రీత్ హ్యాపీ ఫీలింగ్స్
ఆ సినిమాను.. వర్మ ను ఎప్పటికీ మరచిపోను..!
రామ్ చరణ్ క్వారంటైన్ లుక్
లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి..!
నందిత 'ఐపీసీ 376' ట్రైలర్ రిలీజ్...!
మెగా అల్లుడి మంచి నిర్ణయం..!
తాప్సీ లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్
న్యూ లుక్ లో హీరోయిన్ త్రిష
నెపోటిజమ్ అన్ని చోట్లా ఉంటుంది..!
మరోసారి జంటగా నాగచైతన్య , సమంత ?
చిరు సినిమాలో జగ్గూభాయ్..?
రేణు దేశాయ్ గ్రీన్ ఛాలెంజ్ - ఛాలెంజ్ కాదు అందరూ ముందుకు రావాలి..!
టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చాలా మంది ఇప్పటికే సెలెబ్రిటీస్ పాల్గొన్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను రేణు దేశాయ్ కూడా పూర్తి చేసింది. సంతోష్‌కుమార్ ప్రారంభించిన 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి రేణు దేశాయ్ జూబ్లీహిల్స్ లోని పార్కులో తన కూతురితో మొక్కలు నాటించి గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసింది.
దర్శకుడు రాజమౌళి పై తమన్నా ప్రశంసలు
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెలుగు , తమిళ భాషలలో రెండు భాగాలుగా రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ "బాహుబలి "ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి , ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ దర్శకుడు రాజమౌళి తో పాటు ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

''12 O క్లాక్'' తో భయపెడతా అంటున్న వర్మ..!
హార్రర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఒకప్పుడు 'రాత్రి' 'భూత్' సినిమాలతో ఆడియన్స్ ని భయపెట్టాడు. ఇక ఈ మధ్య కాలంలో వర్మ హార్రర్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. వర్మ నుండి హార్రర్ సినిమా వచ్చి చాలా ఏళ్ళే అయింది. ఇప్ప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి హార్రర్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా ''12 O క్లాక్'' అనే హారర్ మూవీని తీస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ రోజు సాయంత్రం 7 గంటలకి 12 'O' క్లాక్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించనున్నారు.
నిహారిక ఎంగేజ్ మెంట్ డేట్ అప్పుడే..?
మెగా కాంపౌండ్ లో కూడా త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిహారికకు కాబోయే వరుడిని అందరికీ పరిచయం చేశారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి కొడుకు చైతన్య. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి నిశ్చితార్దానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగస్ట్ 13న చైతన్య, నిహారిక ల నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆగస్టులో ఎంగెజ్మెంట్, వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
పవన్ కళ్యాణ్ కు జోడీగా తమన్నా ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కోర్ట్ రూమ్ డ్రామా గా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ " మూవీ కి తెలుగు రీమేక్ గా దిల్ రాజు నిర్మిస్తున్న"వకీల్ సాబ్ " మూవీ కి బోనీ కపూర్ సహనిర్మాత. అంజలి , నివేత థామస్, అనసూయ , అనన్య నాగళ్ళ , ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
గోపీచంద్ సాహస నిర్ణయం
యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా "సీటీమార్ " మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తేజ దర్శకత్వంలో రూపొందనున్న "అలిమేలు వెంకట రమణ " మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
"దృశ్యం 2" మూవీ అప్ డేట్
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడు గా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ "దృశ్యం " మలయాళ మూవీ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ లో హీరో మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. తెలుగు , తమిళ , హిందీ , సింహళ భాషలలో "దృశ్యం " మూవీ రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది.
బాడీ షేమింగ్ పై నిత్యా సీరియస్.. మన గురించి వాళ్ళకే ఆలోచన ఎక్కువ..!
సెలక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకునే వారిలో యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఎప్పుడూ ముందుంటది. విభిన్న పాత్రలు చేయడంలో నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటారు. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటారు. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు..ఎంత మంచి రోల్ చేశామన్నది ఆమె సిద్దాంతం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది.
చిరు పాటతో సరోజ్ ఖాన్ కు నివాళి..!
బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ నేడు తుది శ్వాస విడిచారు. ఇక సరోజ్ ఖాన్ మరణంతో బాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. బాలీవుడ్ నటీ నటులు సరోజ్ ఖాన్ మృతిపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
రకుల్ ప్రీత్ హ్యాపీ ఫీలింగ్స్
"కెరటం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ హోదా ను అందుకున్నారు. రకుల్ నటించిన "దే దే ప్యార్ దే ", "మర్జావాన్" హిందీ మూవీస్ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో బిజీగా మారారు. రకుల్ ప్రస్తుతం 2హిందీ , 2 తమిళ , ఒక తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికి పరిమితం అయిన రకుల్ షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ముంబై లో త్వరలోనే ప్రారంభం కానున్న హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆ సినిమాను.. వర్మ ను ఎప్పటికీ మరచిపోను..!
మొదటి సినిమాను.. రామ్ గోపాల్ వర్మను ఎప్పటికీ మర్చిపోను అంటున్నాడు కోన వెంకట్. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా..? రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య' సినిమా. జె.డి చక్రవర్తి, మనోజ్ బాజ్ పాయ్, ఊర్మిళ, శురభ్ శుక్లా ప్రధాన పాత్రల్లో వచ్చిన సత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. 1998 జులై 3 న వచ్చిన ఈ సినిమా నేటితో 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కోన వెంకట్ తన ట్విట్టర్ ఈ సినిమాను, వర్మను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. అవకాశం అనేది దేవుడితో సమానం.. అవకాశం ఇచ్చిన వాళ్ళు దేవునికంటే ఎక్కువ.. నాకు అలాంటి అవకాశం ఇచ్చిన వర్మకు, సత్య సినిమాకు నేను ఎప్పుడు కృతజ్ఞుడినే అంటూ పేర్కొన్నాడు.
రామ్ చరణ్ క్వారంటైన్ లుక్
సూపర్ హిట్ "చిరుత "మూవీ తో టాలీవుడ్ కు రామ్ చరణ్ హీరోగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "మగధీర ", "రచ్చ ", "నాయక్ ", "ఎవడు ", "ధృవ " , రంగస్థలం " వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షక , అభిమానులను అలరించారు. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ "ఖైదీ నెం 150", "సైరా నరసింహా రెడ్డి " మూవీస్ ను నిర్మించారు. ప్రస్తుతం "ఆచార్య " మూవీ నిర్మిస్తున్నారు.
లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి..!
ఇంతకుముందే చెప్పుకున్నాం 2020 సినీ పరిశ్రమకు అంతగా కలిసిరాలేదని. ఒక పక్క కరోనా వల్ల షూటింగ్ లేక, థియేటర్స్ లేక.. సినిమా షూటింగ్ లు ఆగిపోయి భారీ నష్టమే వాటిల్లగా.. మరోపక్క పలు సినీ పరిశ్రమలకు చెందిన నటులు మృతి చెందుతూ విషాదం మిగులుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో లెజెండరీ నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, ఇంకా యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇలా ఎంతో మంది ఈ ఏడాది తనువు చాలించారు.
నందిత 'ఐపీసీ 376' ట్రైలర్ రిలీజ్...!
'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ప్రేమ కథా చిత్రమ్', 'అభినేత్రి' 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రాబోతుంది. ప్రస్తుతం నందిత 'ఐపీసీ 376' అనే సినిమాలో నటిస్తుంది. రామ్ కుమార్ సుబ్బరాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాకర్ నిర్మిస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే పోలీస్…
మెగా అల్లుడి మంచి నిర్ణయం..!
విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ.. ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు దేవ్. టీవీ సీరియళ్ల దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'సూపర్ మచ్చి' అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్ తో వస్తుంది.
తాప్సీ లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్
"ఝుమ్మంది నాదం " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన తాప్సీ పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. తాప్సీ నటించిన "బేబీ ", "పింక్ ", " నామ్ షబానా", "జు డ్వా 2 ", "బద్లా " , "మిషన్ మంగళ్", "సాండ్ కి ఆంఖ్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని తాప్సీ విజయాలు సాధిస్తున్నారు.
న్యూ లుక్ లో హీరోయిన్ త్రిష
"నీ మనసు నాకు తెలుసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమిళ హీరోయిన్ త్రిష తమిళ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ తో 2 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన "వర్షం ", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా ", "ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే " మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.
నెపోటిజమ్ అన్ని చోట్లా ఉంటుంది..!
నెపోటిజమ్... సినీ పరిశ్రమలో ఎప్పటినుండో వున్నదే అయినా రీసెంట్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్ బయటకి వచ్చి తమకు ఎదురైన ఇబ్బందులు కూడా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా నేపోటిజమ్ పై తమన్నా కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మరోసారి జంటగా నాగచైతన్య , సమంత ?
హీరో నాగచైతన్య , సమంత జంటగా "ఏ మాయ చేసావె ", "మనం ", "ఆటో నగర్ సూర్య ", "మజిలీ " మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి జంటగా నటించనున్నారని సమాచారం. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , యోగా , ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తూ సమంత టైమ్ పాస్ చేస్తున్నారు.
చిరు సినిమాలో జగ్గూభాయ్..?
సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ నిలిచాడు. ప్రస్తుతం అటు సీనియర్ హీరోల సినిమాల నుంచి, ఇటు యంగ్ హీరోల సినిమాల వరకూ అందరితో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కేవలం విలన్ పాత్రలోనే కాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తెలుగు, తమిళం,మలయాళం, హిందీ భాషలలో నటిస్తున్నాడు జగ్గూభాయ్.