సస్పెండెడ్ కాఫీ.. మీల్…. అంటే తెలుసా..? మనదగ్గర కూడా రావాలి..!

Tollywood Actress Kajal Aggarwal Explains The Concept Of Suspended Meals And Coffee On Her Instagram Story and Wishes To See It In India As Well

హీరో హీరోయిన్స్ అంటే కేవలం సినిమాలే కాదు సమాజ సేవలో కూడా ముందుంటున్నారు. ఎంతోమంది ఎన్నో సేవలు అందిస్తున్నారు. కొంతమంది బయటకి చెప్పకుండా కూడా చేస్తున్నారు. అందులో కాజల్ కూడా ఉంది. మూడో కంటికి తెలియకుండా సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. అరకు ప్రాంతంలో అత్యంత వెనుకబడి ఉన్న గిరిజన పిల్లలకు ఉచిత విద్య, బాలికలు, యువతుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలు, శానిటైజేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా కాజల్ పెట్టిన పోస్ట్ ఒకటి అందర్నీ ఆలోచింపచేస్తుంది. అదేంటంటే…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీకు సస్పెండెడ్ కాఫీ అంటే తెలుసా..? పోనీ సస్పెండెడ్ మీల్ అంటే తెలుసా? తెలీదు కదా.. అయితే దానికి అసలైన అర్ధం ఏంటో చెపుతా అంటుంది చందమామ కాజల్. తన ఇన్స్టాలో సస్పెండ్ కాఫీ.. సస్పెండెడ్ మీల్ గురించి పోస్ట్ పెడుతూ దానిగురించి కూడా వివరించింది. ఆ పోస్ట్ లో… నార్వేలో ఓ యువతి రెస్టారెంట్‌కు వెళ్లి కౌంటర్‌లో ఐదు కాఫీలకు ఆర్డర్ ఇచ్చి.. అందులో రెండు సస్పెండెడ్ అంటూ ఐదు కాఫీలకు డబ్బులు చెల్లించి మూడు కాఫీలు తీసుకుంది. అదే రెస్టారెంట్‌కు మరో వ్యక్తి వచ్చి పది కాఫీలు, ఐదు సస్పెండెడ్ అంటూ పది కాఫీలకు డబ్బులు చెల్లించి ఐదు కాఫీలు తీసుకొన్నాడు. అదే విధంగా మరో వ్యక్తి వచ్చి ఐదు మీల్స్, రెండు సస్పెండెడ్ అంటూ ఐదు మీల్స్‌కు డబ్బులు చెల్లించి మూడు లంచ్ ప్యాకెట్స్ తీసుకొన్నాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికి ఓ ముసలి వ్యక్తి రెస్టారెంట్‌కు వచ్చి కౌంటర్‌లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడుతూ.. సస్పెండెడ్ కాఫీ ఉందా అని అడిగాడు. వెంటనే కౌంటర్‌లో ఉన్న వ్యక్తి ‘ఎస్’ అంటూ వేడి వేడి కాఫీని అందించింది. ఆ తర్వాత బాగా గడ్డం పెరిగి.. పేదవాడిలా కనిపించే మరో వ్యక్తి వచ్చి సస్పెండెడ్ మీల్ ఉందా అని అడిగితే.. ‘ఎస్‘ అంటూ వేడి వేడి భోజనం ప్యాక్ చేసిన పార్సిల్‌ను, ఓ వాటర్ బాటిల్‌ను అందించారు. సమాజంలో పేదరికం, ఆకలితో బాధపడేవారు ఎంతోమంది వుంటారు… వారితో మనకు పరిచయం ఉండదు. వాళ్ల ముఖం తెలియదు. అలాంటి వారిని ఏదో రూపంలో ఆదుకోవడం కంటే సామాజిక సేవ మరోటి ఉంటుందా?. ఇలాంటి సహాయం యూరప్‌లోని కొన్ని దేశాల్లో జరుగుతున్నది. మనం కూడా ఇలాంటి సేవలందించే స్థాయికి చేరుకోవాలి అంటూ కాజల్ చాలా చక్కగా చెప్పింది.

కాగా ప్రస్తుతం కాజల్ ప్రస్తుతం తెలుగు లో “ఆచార్య “, “మోసగాళ్ళు “మూవీస్, తమిళ భాషలో రెండు సినిమాలు, హిందీ లో “ముంబై సాగ ” మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =