మొత్తానికి నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. కరోనా కారణంగా హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు వాయిదా వేశారు. ఫిబ్రవరిలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లిని జరపాలని ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల కుదర్లేదు. అయితే మరీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు ఇరు కుటుంబసభ్యలు. ఈ నేపథ్యంలోనే జులై 26న వీరిద్దరి వివాహం జరగనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఫైనల్ గా అధికారికంగా కూడా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూలై 26 సాయంత్రం 8గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరపనున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలవారు, సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరవనున్నారు. నితిన్, షాలినికి 2012లోనే పరిచయం ఏర్పడింది. స్నేహంతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది.
ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాధున్’ రీమేక్, కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ మధ్యే నిఖిల్ పెళ్లి చేసుకోగా.. రానా పెళ్లి ఆగష్ట్ లో జరగనుంది. ఇక సాహో డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది. మెగా డాటర్ నిహారిక పెళ్లి పై కూడా క్లారిటీ వచ్చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: