శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డర్టీ హరి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో సన్నివేశాల్లో కూడా రొమాంటిక్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఈ ట్రైలర్ యూత్ ని బాగానే ఆకట్టుకుంటుంది. అంతేకాదు సినిమాపై అంచనాలను కలిగిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
His world may sound DIRTY, but it’s actually FUN!
Here’s #MSRaju‘s #DirtyHariTrailer ▶️ https://t.co/P8S5hx2dVK#DirtyHari *ng @ShravanReddy7_ @iRuhaniSharma & @simratkaur_16@markkrobin #GuduruShivaRamaKrishna #GuduruSateeshBabu #GuduruSaiPuneeth @SPJCreations @MangoMusicLabel— Telugu FilmNagar (@telugufilmnagar) July 18, 2020
కాగా పరిచ గూడూరి శివరామకృష్ణ, గూడురు సతీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్పీజే క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు ఎంఎస్ రాజునే రాశారు.
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ రికార్డులను క్రియేట్ చేసిన ఎం.ఎస్. రాజు రొటీన్ కథలకు స్వస్తి చెప్పి.. నేటి యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన తెరకెక్కించిన సినిమా ‘డర్టీ హరి’. మరి ఈ సినిమా యూత్ కు ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: