వన్ ఇయర్ పూర్తి చేసుకొన్న “ఇస్మార్ట్ శంకర్ “

Energetic Star Ram and Director Puri Jagannadh Powerful Mass Entertainer Ismart Shankar Turns 1 Year

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ “ఇస్మార్ట్ శంకర్ ” 2019 సంవత్సరం జులై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , మ్యూజిక్ డైరెక్టర్ లతో పాటు సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా రామ్ జీ సినీ అవార్డ్స్ గెలుచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పక్క తెలంగాణ యాస లో హీరో రామ్ డైలాగ్ డెలివరీ , పెర్ఫార్మెన్స్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీకి హై లైట్ గా నిలిచాయి. తెలంగాణ యువకుడిగా రామ్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో రామ్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన”ఇస్మార్ట్ శంకర్ ” మూవీతో కథానాయికలు నిధి , నభా నటేష్ లు పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. మాస్ మసాలా “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ నేటితో దిగ్విజయంగా ఒక సంవత్సరం కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “RED ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 4 =