మలయాళ సినిమా అంగమలై డైరీస్‌ను తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్’గా తెరకెక్కించిన విశ్వక్ సేన్.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు విశ్వక్ కోసమే ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే మలయాళం హిట్ సినిమా ‘కప్పేలా’ తెలుగు రీమేక్ లో ఒక ప్రధాన పాత్ర కోసం సెలెక్ట్ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విశ్వక్ సేన్ తమిళ్ హిట్ మూవీ ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. పీవీపీ సినిమాస్ ‘ఓ మై కడవులే’ హక్కులను సొంతం చేసుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు తెలుగులో డైలాగ్ రైటర్ గా పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ ను కన్ఫామ్ చేశారట. ప్రస్తుతం తరుణ్.. విశ్వక్ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడట. మరి తరుణ్ రైటింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పెళ్లిచూపులు.. ఈ నగరానికి ఏమైంది సినిమాలు చూసాం. యూత్ కు కనెక్ట్ అయ్యేలా కంటెంట్ ఇవ్వడంతో పాటు ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. ఇక ఈ సినిమాకు కూడా అదే రేంజ్ లో డైలాగ్స్ ఇస్తాడేమో చూద్దాం.
కాగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ , రితికా సింగ్ జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “ఓ మై కడవులే “. తమిళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. హీరో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో నటించాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: