శైలేష్ కొలను EXCLUSIVE Interview – ఎక్కువ మంది సినిమా చూడాలన్నదే నా స్వార్ధం

HIT DIRECTOR SAILESH KOLANU EXCLUSIVE INTERVIEW

శైలేష్ కొలను డైరెక్టర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన ‘ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ ‘హిట్’. చిన్న సినిమాగా విడుదలై ఈ సినిమా పెద్ద హిట్‌నే అందుకుంది. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రీమేక్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు నటిస్తున్న ఈ సినిమాను కూడా శైలేష్ కొలనే డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సందర్భంగా ‘దతెలుగుఫిలింనగర్.కామ్’ ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలేష్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిట్ సినిమా అంత హిట్ అవుతుందని మీరు ఊహించారా..?

అనుకున్నాను.. కథ రాస్తున్నప్పుడే అనుకున్నాను ఈ సినిమా సక్సెస్ అవుతుందని..నేను కథ రాయడం మొదలు పెట్టినదగ్గర నుండి.. ఫ్రెండ్స్ కు కానీ, నాని కి కానీ, ఇంకా నా క్లోజ్ సర్కిల్ లో వాళ్ళకి ఇలా ఓ 40, 50 మందికి కథ చెప్పాను.. ఎవరికి కథ చెప్పినా అందరూ పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు.. ఏ కథ అయినా కొంతమందికి నచ్చుతుంది.. కొంతమందికి నచ్చదు కదా.. కానీ ఈ సినిమా కథ నేను చెప్పిన వారందరికీ నచ్చింది.. యూనిక్ గా ఉండటంతో ఇంత సక్సెస్ అయింది.

హిట్ సినిమా బాలీవుడ్ వాళ్ళకి కూడా నచ్చింది.. అంటే బాలీవుడ్ ను దృష్టిలో పెట్టుకొని కూడా కథ రాశారా..?

లేదు.. తెలుగులో మంచి పేరొస్తుందనే చేశాను.. ఓ మంచి కథ చెప్పాలి.. నాకు దొరికిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి.. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వేస్ట్ చేసుకోకుండా నాని గర్వంగా ఫీల్ అయ్యే ప్రాజెక్ట్ ఇవ్వాలన్నంత వరకే నా కాన్సన్ట్రేషన్ ఉంది. అయితే నాకు అర్ధమైన విషయం ఏంటంటే… ‘హిట్’ అనేది ఖచ్చితంగా ఓ గ్లోబల్ సబ్జెక్ట్.. అంటే ఉమెన్ సేఫ్టీ అనేది మనకు ఎక్కడున్నా రిలవెంటే.. ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న ప్రాబ్లమే ఇది ఇంకా క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ మన వాళ్ళకు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి.. ఈ రెండు పాయింట్స్ ఉండటంతో సినిమా హిట్ అయింది. ఓటీటీ లో రిలీజ్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఇష్టపడతారని నమ్మాను.. అయితే బాలీవుడ్ వాళ్లకు నచ్చడం.. రాజ్ కుమార్ లాంటి హీరో నటించడం గ్రేట్ థింగ్.

హిట్ సినిమా కథకు నిజ జీవితంలో ఏదైనా సంఘటన కారణమా..?

అంటే ఇలాంటి కథకు కచ్చితంగా రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొనే రాస్తాం.. రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ ను నేను కొంచం డ్రమటైజ్ చేసుకొని రాసుకున్నా.. నిజానికి ఈ కథ రాస్తున్నప్పు నేను ఇండియాతో పాటు పలు దేశాల్లో జరిగిన క్రైమ్స్ ను డైరీలో నోట్ చేసుకున్న… ఎక్కడెక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి డాక్యూమెంటరీస్, పేపర్ కటింగ్స్ ఇలా చాలా వర్క్ చేసాను.. 2,3 వందల క్రైమ్ స్టోరీస్ ను నేను రాసి పెట్టుకున్నా ఒక డైరీస్ లో. ఇందులో ఏంటంటే.. ఒక్కో క్యారెక్టర్ ఒక్కో క్రైమ్ నుండి తీసుకోవచ్చు… మొత్తం ఇన్సిడెంట్ ను ఉపయోగించుకోలేకపోవచ్చు కానీ.. కొన్ని థింగ్స్ మనం వాడుకోవచ్చు.. హిట్ సినిమాలో షీలా క్యారెక్టర్ అవ్వొచ్చు.. స్వప్న క్యారెక్టర్ అవ్వచ్చు రియల్ లైఫ్ నుండి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్లే. ఒక్క ఇన్సిడెంట్ నుండి అని చెప్పలేం కానీ పలు క్రైమ్ స్టోరీస్ ను బేస్ చేసుకొని రాసుకున్న కథ అని చెప్పొచ్చు.

తనతో సినిమా చేయడానికి నాని మీకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ వార్త నిజమేనా..?

ఇప్పటివరకూ అయితే ఆఫీషియల్ ఏం అనుకోలేదు.. నానితో 2017 నుండి నా జర్నీ స్టార్ట్ అయింది.. 2017 జాన్ లో నేను నానికి కథ వినిపించడం నచ్చడం 2019 లో సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే 4 ఇయర్స్ నుండి నానితో ట్రావెల్ చేస్తున్నా తనకు ఎలాంటి కథలు నచ్చుతాయో తెలుసు.. అలానే నానికి కూడా నా గురించి తెలుసు.. నా సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో.. ఎలాంటి విజువల్స్ ఉండాలని అనుకుంటానో.. నాని కూడా గమనిస్తాడు. అయితే ఇద్దరికీ సింక్ అయ్యే కథ దొరకాలి.. కానీ నాని కోసం ఓ కథ కచ్చితంగా రాస్తాను.. తనని ఒప్పించి ఎలా అయినా సినిమా తీస్తా… ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. నాని యాక్టింగ్ స్కిల్స్ గురించి తెలుసు.. ప్రతి డైరెక్టర్ నానితో చేయాలనుకుంటారు.. నేను కూడా తీస్తా. ఇద్దరికీ కనెక్ట్ అయ్యే కథ దొరకడమే లేట్… నా దగ్గర ప్రస్తుతం 7, 8 కథలు వున్నాయి.. అవి ఎప్పుడైనా న్యూస్ చూస్తున్నప్పుడో.. పేపర్ చదువుతున్నప్పుడో ఇలా స్ట్రైక్ అయి రాసినవే… అలానే నానికి కూడా జరుగుతుంది. ఆఫీషియల్ అయితే ఏం లేదు.. కానీ కరెక్ట్ స్టోరీ దొరికినప్పుడు మాత్రం నానితో ఫ్యూచర్ లో తప్పకుండా సినిమా తీస్తా.

హిందీలో కూడా ‘హిట్’ ని డైరెక్ట్ చేస్తున్నారు.. ఇదే స్క్రిప్ట్ తో చేస్తారా.. ఏమైనా మార్పులు చేస్తారా..?

నేను ఇంతకుముందు చెప్పినట్టే హిట్ సినిమా గ్లోబల్ వైడ్ సబ్జెక్ట్. అదేకాకుండా నాకు కామన్ గా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటంటే చాలా న్యాచురల్ గా ఈ సినిమా ఉంది..రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూసినట్టే వుంది అని అన్నారు చాలా మంది.. సో అక్కడ కూడా న్యాచురల్ గా.. సహజత్వానికి మ్యాగ్జిమమ్ దగ్గరగా ఉండేలా మాత్రం చూస్తాను.. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే… ఆడియన్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్.. రివ్యూయర్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ పక్కన పెడితే ఒక ఫిలిం మేకర్ గా మన సినిమాను మనం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు.. మనం ఎక్కడ చిన్న చిన్న తప్పులు చేసాం అన్నది మన మైండ్ లో ఉంటది.. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నా అంతే.. అంతేకాని ఎక్కువ కంటెంట్ ను మార్చాల్సిన అవసరంలేదు. దానికి ఈ సినిమాలో విశ్వక్ సేన్ తన యాక్టింగ్ తో ఒక బార్ సెట్ సెట్ చేసాడు.. సో ఇప్పుడు అదే పాత్రలో వేరే ఇంకో హీరో చేయాలంటే మాత్రం చాలా కష్టం.. కానీ రాజ్ కుమార్ రావు లాంటి యాక్టర్ అయితే ప్రాబ్లమ్ లేదు.. తను చేసే కెపాసిటీ ఉంది. అంతే న్యాచురల్ గా వస్తుంది అని అనుకుంటున్నా..

హిట్ సినిమా సీక్వెల్ ఉందని చెప్పారు.. హిందీ రీమేక్ చేసిన తర్వాత చేస్తారా? ముందే సీక్వెల్ చేసి హిందీ రీమేక్ చేస్తారా..?

ముందు హిట్2 చేసిన తర్వాతే బాలీవుడ్ లో రీమేక్ చేస్తాను.. ఎందుకంటే హిట్ సినిమా సక్సెస్ అప్పుడే హిట్2 సినిమా తెస్తానని ఆడియన్స్ కు మాటిచ్చాను.. సో ముందు హీట్ 2 నే చేస్తాను.. దానికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే ఇస్తాము.. ప్రస్తుతం వర్క్ జరుగుతుంది.. హిట్ రీమేక్ కు చాలా టైం పడుతుంది ఎందుకంటే అక్కడ బొంబాయి లో కూడా పరిస్థితులు బాలేదు.. సో ముందు హిట్ 2 పూర్తి చేస్తాను. హిట్ 2 లో ఎవరు చేస్తున్నారు.. ఏంటి అనే విషయాలు కూడా ఇప్పుడు చెప్పలేను.. ప్రొడక్షన్ హౌస్ నుండి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు..ఆ ఫీలింగ్ ఎలా వుంది..?

ఒక ఫిలిం మేకర్ మనీ కంటే.. ఫేమ్ కంటే ఎక్కువ తమ పనిని.. డైరెక్షన్ ను ఎక్కువ చూడాలని.. అందరూ అప్రిషియేట్ చేయాలని అనుకుంటాడు. నా ఇంటెన్షన్ అయితే తెలుగు సినిమాలు ఎక్కువ చేయాలని.. ఒకవేళ హిట్ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయి.. ఆఫర్స్ వచ్చినా నేను మాత్రం తెలుగు సినిమాలే చేస్తాను.. నేను పెరిగిందే ఇక్కడే.. మన తెలుగు హీరోస్ కు కొత్త కొత్త కథలు క్రియేట్ చేయాలని ఉంటుంది కదా.. నేను సిడ్నీ నుండి అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చిందే మన తెలుగు సినిమాల కోసం.. ఇప్పుడు సడెన్ గా ‘హిట్’ అయిందని వెళ్ళను.. అయితే హిట్ సినిమా చేయడానికి ఒప్పుకోడానికి రీజన్ ఏంటంటే.. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే హిట్ పాన్ ఇండియా సినిమా.. సో ఈ కథ ద్వారా చాలా మంది ఆడియన్స్ కు రీచ్ అవ్వొచ్చు.. నేను అనుకునేది ఒక్కటే బాలీవుడ్ లో కూడా ‘హిట్’ సూపర్ హిట్ అవ్వాలి….అక్కడ కూడా సక్సెస్ అవ్వాలి. దానితో నేను తెలుగులో సినిమా తీసినా కూడా అది ఎక్కువ మంచి చూసే అవకాశం ఉంటుంది.. అరే ఈ సినిమా హిట్ డైరెక్టర్ తీసిన సినిమా కదా ఒకసారి చూద్దాం అని నార్త్ ఆడియన్స్ కూడా అనుకోవాలి.. అదొక స్వార్ధమే కానీ నా సినిమా అందరూ చూడాలి.

ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు.. స్టోరీ ఏ ఏరియాలో జరిగితే.. ఆ లాంగ్వేజ్ లో ఉండాలి స్టోరీ కమ్యూనికేషన్ అనేది.. ఉదాహరణకి నేను కోల్ కతా లో సినిమా సెట్ చేస్తే.. సినిమాలో క్యారెక్టర్స్ బెంగాల్ లోనే మాట్లాడాలి.. అలాగే ఇక్కడ సెట్ చేస్తే సినిమాలో నటించేవాళ్ళు తెలుగు లోనే మాట్లాడాలి.. లాంగ్వేజ్ కాకుండా మీ సినిమాను చూడాలంటే ఫస్ట్ మన వర్క్ గురించి తెలియాలి.. అదే నేను కూడా చేయాలనుకునేది. అక్కడ కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనే కొంచం వర్క్ చేస్తున్నాను.. ఒకసారి సినిమా హిట్ అయి నార్త్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయితే నా సినిమాలు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నా..

రైటర్ గా, డైరెక్టర్ గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు..?

కమల్ హాసన్ గారు నాకు ఇన్స్పిరేషన్. నా చిన్ననాటి నుండి కమల్ హాసన్ గారే స్ఫూర్తి. ఆయన రైటింగ్ స్కిల్స్ కానీ.. డైరెక్టోరియల్ స్కిల్స్ కానీ ఏదైనా చూస్తే.. అయన 10ఏళ్లు ముందే ఆలోచిస్తారు. ఆయనకు అది శాపం కూడా అనుకోవచ్చు.. ఇప్పుడు హేరామ్ లాంటి సినిమా ఇప్పుడు తీయడానికి కూడా చాలా మందికి గట్స్ సరిపోవు.. ప్రీ ఇండిపెండెన్స్ స్టోరీని నెరేట్ చేయడం.. దాని సంబంధించి హార్డ్ వర్క్ సింక్ సౌండ్, మేకప్ ను చూస్తే చాలా గొప్ప ప్రాజెక్ట్ అది.. ఇప్పుడు మీరు ఏ ఫిలిం మేకర్ ను అడిగినా చేయమని భయపడతారు. అయన చేసిన ద్రోహి సినిమా కూడా నామీద చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు హిట్ చూస్తే.. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ కి మూడ్ ఎలా ఉండాలి.. ఆ అప్ప్రోచ్ ఎలా ఉండాలి.. ఒక డార్క్ టోన్ అవ్వొచ్చు.. సీరియస్ గా కథ వెళ్లే తీరు అవ్వొచ్చు.. నా థింకింగ్ పై కూడా ద్రోహి సినిమా ఇంపాక్ట్ చాలానే ఉంటుంది. హేరామ్ సినిమా చూసిన తర్వాత ఫిలిం మేకింగ్ పై చాలా ఇంట్రెస్ట్ పెరిగింది.
ఆయన్ని ఒకసారి కలిసి ఆయనతో వర్క్ అంటే పెద్ద ఆశనే అది అవుతుందో లేదో చెప్పలేం కానీ.. ఆయన్ని ఒకసారి కలిసి ఆయన సినిమాల ప్రభావం ఎంత వుంది.. ఒక ఫిలిం మేకర్ అవ్వడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో చెప్పాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =