ఉపాసన సేవాగుణం గురించి అందరికీ తెలుసు. అపోలో వైస్ ఛైర్మన్‌గా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఉచితంగా మందుల పంపిణి కూడా చేస్తున్నారు ఈమె. అంతేకాదు ఉపాసన కు మూగ జీవాలు అంటే కూడా చాలా ఇష్టం. ఇటీవలే రాణి అనే ఇక ఏనుగును కూడా దత్తత తీసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది ఉపాసన. హెల్త్ విషయంలో తనకు తెలిసిన చిట్కాలను, యోగాలకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు రామ్ చరణ్, చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చే వరకు ఉపాసన తన సోషల్ మీడియాలోనే వారికి సంబందించిన అప్ డేట్స్ అభిమానులకు అందిస్తూ ఉండేది. చెర్రీకి సంబంధించిన ఫొటోలు, అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తూ ఆమె మెగా అభిమానులకు కూడా దగ్గరైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు ఉపాసన పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ్ ఉపాసన సేవాగుణాన్ని ప్రస్తావిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఇతరులపై దయ చూపుతూ నువ్వు చేసే పనులు ఎంత చిన్నవైనా సరే అవి ఎన్నటికీ వృథాకావు. నీ మంచి పనుల్ని ఇలాగే కొనసాగిస్తూ వెళతావని ఆశిస్తున్నాను.. గుర్తింపు దానికదే వస్తుంది. హ్యాపీ బర్త్ డే’ అని రామ్ చరణ్ పోస్ట్ చేశాడు. మెగా అభిమానులు కూడా ఉపాసనకు బర్త్ డే విషెస్ చెపుతున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: