విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక తమిళంలో పిచ్చైకరన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టడమే కాకుండా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. అమ్మ సెంటిమెంట్ తెరకెక్కిన ఈ సినిమా 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయిందని ఇప్పటికే విజయ్ ఆంటోని చెప్పడం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమాపై విజయ్ అప్డేట్ ఇచ్చారు. బిచ్చగాడు 2 మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు తెలిపారు. జులై 24న విజయ్ పుట్టినరోజు కావడంతో.. ఆరాజు బిచ్చగాడు 2 మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఆరోజు వెల్లడి కానున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)