జాన్వీ కపూర్ మనసులోని కోరిక

Janhvi Kapoor Wishes To Play The Lead Role In Helen Movie If It Gets Remade In Bollywood

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సూపర్ హిట్ “దఢక్ ” మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ “సైరాత్ “మరాఠీ మూవీ హిందీ రీమేక్ గా రూపొందిన “దఢక్ ” మూవీ లో జాన్వీ కపూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత ఆంథాలజీ మూవీ “ఘోస్ట్ స్టోరీస్ ” లో ఒక కథలో నటించారు. జాన్వీ కపూర్ నటించిన లేడీ పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ “, జాన్వీకపూర్ ద్విపాత్రాభినయం చేసిన కామెడీ హారర్ “రూహీ అఫ్జానా ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జాన్వీ ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న “దోస్తానా 2 ” మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హ్యాబిట్ ఆఫ్ లైఫ్ , బిగ్ బ్యాంగ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వినీత్ శ్రీనివాసన్ నిర్మాణ సారథ్యంలో మథుకుట్టి దర్శకత్వంలో అన్నా బెన్ ప్రధానపాత్రలో, కోల్డ్ స్టోరేజీ లో చిక్కుకున్న యువతి ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో రూపొందిన సర్వైవల్ థ్రిల్లర్ “హెలెన్ ” మళయాళ మూవీ 2019 సంవత్సరం నవంబర్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. “హెలెన్ ” మూవీ తెలుగు , కన్నడ , తమిళ భాషలలో రీమేక్ కానుంది. ఈ మూవీ హిందీ భాషలో రీమేక్ అయితే ఆ మూవీ లో నటించాలనే కోరికను జాన్వీ వెల్లడించారు. ఉత్కంఠత తో సాగే కథ తో రూపొందిన “హెలెన్ ” మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ నటించి తన ట్యాలెంట్ ను నిరూపించుకొనే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 1 =