గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ పై ఇటీవలే పలు రూమర్స్ వస్తుండగా వాటికి క్లారిటీ కూడా ఇచ్చేసారు. ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉందని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ మంచి హిట్ కొట్టి చాలా ఏళ్ళే అయింది. అంచనాలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేసాయి థమన్ ట్వీట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ట్వీట్ చేసాడు థమన్. క్రాక్ సినిమాకు సంబంధించి ఇప్పుడే కొన్ని విజువల్స్ చూసాను అదిరిపోయాయి… జీకే విష్ణు సినిమాటోగ్రఫీ సూపర్..రవితేజ అన్నకు ఇచ్చిన ఆల్బమ్స్ లో ఇది ఒక బెస్ట్ ఆల్బమ్… గోపీచంద్ సినిమాల్లో బెస్ట్ సినిమా అవుతుంది.. మాస్ రీలోడెడ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనితో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఎలా ఉందో తెలియాలంటే మనం కూడా సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
Jus saw some visuals of @RaviTeja_offl anna ‘s #krack !! ♥️🗯🗯🗯🗯@dop_gkvishnu NAILED O NAILED it . @megopichand best so far !! #massreloaded 💨💨💨💨💨
It’s my best album for anna 🔈🔈🔈🔈!! #Fun #melody #theme #mass #oorraaamass !!
Good day god bless 🤗 #RTF ✊ pic.twitter.com/HQsVmgXuFg— thaman S (@MusicThaman) July 20, 2020
ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: