నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలియదు..!

Mahesh Babu’s Cute Birthday Wishes To Sitara

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ.. తమ ముద్దుల కూతురు.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. ఇక కూతురు అంటే మహేష్ కు పంచ ప్రాణాలు అన్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఆ ప్రేమను మరోసారి తెలియచేసారు మహేష్. ఈ రోజు సితార పుట్టిన రోజు కావడంతో మహేష్ సితారకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. తన ట్విట్టర్ లో సితారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మహేష్.. చాలా ఫాస్ట్ గా 8ఏళ్లు గడిచిపోయాయి..హ్యాపీ బర్త్ డే.. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో అది నీకు తెలియదు అంటూ సితార పై ఎంత ప్రేమ ఉందో మరొక్కసారి చూపించారు. న‌మ్ర‌త, గౌత‌మ్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా సితార‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక మహేష్ అభిమానులు కూడా సితారకు బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు. సితార ఇలాంటి బ‌ర్త్‌డే వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చిన్నప్పటి నుండి సితార చాలా యాక్టీవ్ అని చెప్పొచ్చు. అందుకే మహేష్ తో బయటకి ఎప్పుడొచ్చినా సరే సితార పాపే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇక తండ్రికి తగ్గ తనయురాలిగా అప్పుడే సితార కూడా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇక ఇప్పుడు స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే నిర్వహిస్తుంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఒక డిస్నీ సినిమాలో ఒక పాత్రకుగాను డబ్బింగ్ కూడా చెప్పింది. ఇలా చిన్న వయసులోనే తనలోని టాలెంట్స్ ను బయటపెడుతోంది.

ఇక ఇదిలా ఉండగా కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మహేష్ కూడా ఇంట్లోనే ఉంటూ సితార, గౌతమ్ లతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ వారితో ఆడుకుంటూ ఉన్నా వీడియో లను నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉన్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ బాబు తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్నాడు. సర్కార్ వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను పరిస్థితులు చక్కబడిన తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 12 =