ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 147
ఒకే క్యారెక్టర్ తో మలయాళ మూవీ

వైష్ణవ్ తేజ్ - రకుల్ సినిమా లాంచ్

థియేటర్స్ లోనే "క్రాక్ " మూవీ రిలీజ్

'గుడ్ లక్ సఖి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
దర్శకుడు శైలేష్ కొలను అద్భుత ఆఫర్
టాలెంట్ ముఖ్యం - జాన్వీ కపూర్
నేడే నిశ్చితార్ధం..?

'RX100' తో కరోనాని తొక్కేయండి సర్
సంజయ్ భాయ్ మీరొక ఫైటర్
త్వరలో సెట్స్ పైకి నాగశౌర్య కొత్త సినిమా..!
కార్లు అమ్మడానికి కారణం అదే..!
బ్రేక్ తర్వాత 'వకీల్ సాబ్' వర్క్
మహేష్-విజయ్ ఫ్యాన్స్ కు వివేక్ రిక్వెస్ట్..!
గ్రీన్ చుడిదార్ లో సమంత

10 ప్యాక్ సాధిస్తా -నాగశౌర్య
రాజ్ పుత్ రాణి గెటప్ లో సాయి పల్లవి
నాని 'బైపోలార్ డిజార్డర్' అంతా అబద్దం
మెగా డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఖరారు..?
'సైరా' తరువాత సురేందర్ రెడ్డి ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. అయితే గత కొన్ని రోజులుగా సురేందర్ రెడ్డి – అఖిల్ కాంబో గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ సినిమా దాదాపుగా ఖాయం అయిపోయినట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ కథను నాగార్జునకు, అఖిల్‌కు సురేందర్ రెడ్డి వినిపించారట. ఇక కథ నచ్చడంతో సురేందర్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు అఖిల్ కోసం మంచి ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ లో ఉండే కథను సిద్ధం చేశాడట సురేందర్ రెడ్డి. అఖిల్ క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన…
ఒకే క్యారెక్టర్ తో మలయాళ మూవీ
ప్రయోగాత్మక మూవీస్ కు మలయాళ చిత్రపరిశ్రమ పెద్ద పీట వేస్తుందని తెలిసిన విషయమే. ఇప్పుడు ఒకే ఒక్క పాత్రతో ఒక మలయాళ మూవీ రూపొందుతుంది. డ్రీమ్ బిగ్ అమిగోస్ బ్యానర్ పై మిథున జ్యోతి దర్శకత్వంలో AK విజుబల్ ప్రధాన పాత్రలో థ్రిల్లర్ "18 +" మలయాళ మూవీ రూపొందుతుంది. 15 మంది టీమ్ మెంబర్స్ తో త్రివేండ్రం లోని ఒక లొకేషన్ లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుంది.

వైష్ణవ్ తేజ్ - రకుల్ సినిమా లాంచ్
మెగా కాంపౌండ్ నుండి వెండి తెరకు పరిచయమవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇప్పటికే 'ఉప్పెన' సినిమా తెరకెక్కింది. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది.. ఎప్పుడో వైష్ణవ్ తేజ్ వెండి తెరకు పరిచయం అయ్యేవాడు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే సినిమాపై మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్…

థియేటర్స్ లోనే "క్రాక్ " మూవీ రిలీజ్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరో గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

'గుడ్ లక్ సఖి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువతిగా కనిపించిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమా కరోనా వల్ల ఆలస్యం అయింది.
దర్శకుడు శైలేష్ కొలను అద్భుత ఆఫర్
ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ప్రవేశించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. సోషల్ మీడియా లో ప్రతిభను చాటుకునేవారికి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. టాలెంట్ ఉండీ అవకాశాలు రాని వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి దర్శకుడు శైలేష్ కొలను అద్భుతమైన అవకాశం కల్పించారు. ఇంట్లోనే ఉండి ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని, తమకు నచ్చిన సీన్ లో నటించిన వీడియో ను మెయిల్ చేయమని , ఒక వేళ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తే ఆ వీడియోలు ఆడిషన్స్ @ శైలేష్ కొలను .కామ్ కు పంపించమని , పర్సనల్ గా వాటిని పరిశీలించి, తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటానని శైలేష్ చెప్పారు.
టాలెంట్ ముఖ్యం - జాన్వీ కపూర్
లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సూపర్ హిట్ "ధడక్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కార్గిల్ వార్ లో పాల్గొన్న మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ " హిందీ మూవీ OTT ద్వారా నిన్న రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ కపూర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్టార్ హీరోలు హృతిక్ రోషన్ , సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రశంసలు అందుకున్నారు.
నేడే నిశ్చితార్ధం..?
మెగా డాటర్ నిహారిక పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది కూడా. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. జొన్నలగడ్డ వెంకట చైతన్య హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఇక ఇరువురు కుటుంబాలకు మంచి అనుబంధం ఉండటంతో ఈ పెళ్లి నిశ్చయించారు. ఇక చైతన్యతో తీసుకున్న ఫొటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంది నిహారిక. ఈ నేపథ్యంలో ఆగష్ట్ లో ఎంగేజ్ మెంట్ అని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

'RX100' తో కరోనాని తొక్కేయండి సర్
ఆర్ఎక్స్ 100 అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే ఈ రోజు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. కరోనా వచ్చేసింది.. త్వరలోనే వస్తా.. ప్లాస్మా ఇస్తా అని ట్వీట్ లో తెలిపారు. ఇక ఈరోజు అజయ్ భూపతి పుట్టినరోజు కూడా. ఇక ఈ సందర్భంగా కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా అజయ్ కు కరోనా వచ్చిన నేపథ్యంలో దానిపై కూడా స్పందించాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదామంటే కరోనా గురించి ట్వీట్ చేసేలా చేశారేంటి సర్. ఇందులో కూడా పాత్ బ్రేకింగ్ ఉన్నారు మీరు. ఏం పర్లేదు సర్.. కరోనాని ఆర్ఎక్స్ 100 తో తొక్కేసి వచ్చేయండి...హ్యాపీ బర్త్ డే సర్.. ఫాస్ట్ గా రికవర్…
సంజయ్ భాయ్ మీరొక ఫైటర్
సంజయ్ దత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజుల క్రితం ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడటంతో హాస్పిటల్ లో చేరగా అక్కడ సంజయ్ దత్ కు కరోనా పరీక్షలు చేశారు. అయితే కరోనా నెగిటివ్ వచ్చింది కానీ లంగ్ క్యాన్సర్ అని తేలింది. దీనితో త్వరలోనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. అంతేకాదు చికిత్స నిమిత్తం తాను షూటింగ్‌ల నుంచి విరామం తీసుకుంటున్నానని, అయితే తన అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. తన ఆరోగ్యంపై వచ్చే ఎలాంటి రూమర్స్ ను నమ్మవద్దని త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తానని ట్వీట్ కూడా చేశారు.
త్వరలో సెట్స్ పైకి నాగశౌర్య కొత్త సినిమా..!
సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకుముందు ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తుంది నాగశౌర్య మేకోవర్ చూస్తుంటే. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతున్నట్టు తెలుస్తుంది.
కరోనా నుండి కోలుకున్న రాజమౌళి.. ప్లాస్మా దానానికి టైముంది..!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి.. ఆయన కుటుంబ సబ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. నాకు.. నా ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చింది... వైద్యుల సూచన మేరకు మేము హోం క్వారంటైన్లో ఉంటున్నాం. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ఇక ఈ విషయం చెప్పి రాజమౌళి ఇప్పటికే రెండు వారాలు అయిపోయింది. హోమ్ క్వారంటైన్ పూర్తి అవ్వడంతో మరోసారి టెస్ట్ చేయించుకోగా అందులో అందరికీ నెగిటివ్ వచ్చిందట. ఈ విషయాన్నికూడా రాజమౌళినే స్వయంగా తన ట్విట్టర్ లో తెలిపారు.
కార్లు అమ్మడానికి కారణం అదే..!
రేణు దేశాయ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా రేణు దేశాయ్ ఆ తర్వాత మళ్ళీ పవన్ తో జానీ సినిమా చేశారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత పవన్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు విడిపోయారనుకోండి. అది వేరే స్టోరీ. అయితే ఒక్క హీరోయిన్ మాత్రమే కాదు రేణు దేశాయ్ లో ఇంకా చాలా కోణాలే వున్నాయి. క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేశారు, డైరెక్టర్, రచయిత్రి మరి ఎన్నో కవితలు కూడా రాసింది. అంతేకాదు సామజిక సేవ చేయడంలో కూడా రేణు దేశాయ్ ముందుంటుంది. తనకు ఉన్నంతలో పలువురికి సాయం చేస్తుంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురు, కొడుకు విశేషాలను…
బ్రేక్ తర్వాత 'వకీల్ సాబ్' వర్క్
పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది. పవన్ ఇంకో సినిమాను కూడా మొదలు పెట్టి ఉండేవి. అయితే కరోనా వల్ల పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. వకీల్ సాబ్ షూటింగ్ కూడా వాయిదా పడింది. కనీసం అప్ డేట్ కూడా లేకుండా పోయింది. దీనితో వకీల్ సాబ్ నుంచి ఒక్క అప్డేట్ అయినా రావాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు…
మహేష్-విజయ్ ఫ్యాన్స్ కు వివేక్ రిక్వెస్ట్..!
తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రంలో పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా ఇతరుల చేత కూడా నటిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా ఇటీవలే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వయంగా స్వీకరించి మొక్కలు నాటిన సంగతి తెలిసిందే కదా. అనంతరం ఈ ఛాలెంజ్ ను ఎన్టీఆర్, విజయ్, శృతి హాసన్‌ని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించిన విజయ్ చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఇక దీనితో ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తూ తమ…
ఈ పరిస్థితిలో థియేటర్స్ ఓపెన్ చేస్తే వెళతారా? వెళ్ళరా?
2020 ఇలా ఉంటుందని ఎవరూ ఉహించనుకూడా ఉండరు. కరోనా వచ్చినా ఏదో రెండు మూడు నెలలు ఉంటుందేమో అని అనుకున్నారు కానీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. ఇక ఈ కరోనా వల్ల ఎన్నో పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినీపరిశ్రమకు కొన్ని కోట్లలో నష్టం కలిగింది. షూటింగ్స్ ఎలాగూ లేవు.. కనీసం థియేటర్స్ అయినా ఓపెన్ అవుతాయా.. ఆ బిజినెస్ అన్నా జరుగుతుందా అంటే అదీ లేకుండా పోయింది.
గ్రీన్ చుడిదార్ లో సమంత
తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు తెలుగు , తమిళ మూవీస్ కు సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్అందుకున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ "ఓ బేబీ " మూవీ తరువాత ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ పై ఆసక్తి చూపుతున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో నటించిన సమంత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

10 ప్యాక్ సాధిస్తా -నాగశౌర్య
బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న "చందమామ కథలు " మూవీ తో నాగశౌర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఊహలు గుస గుస లాడే ", "దిక్కులు చూడకు రామయ్య ", "కల్యాణ వైభోగమే ", "ఛలో ", "ఓ బేబీ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. "అశ్వథ్థామ" మూవీ లో యాక్షన్ సీన్స్ లో నాగశౌర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలువిద్య నేపథ్యంలో రూపొందున్న స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్నారు.
రాజ్ పుత్ రాణి గెటప్ లో సాయి పల్లవి
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీతో సాయి పల్లవి తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యారు. "ఫిదా " మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఫిదా చేసి, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సాయి పల్లవి నటించిన తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
నాని 'బైపోలార్ డిజార్డర్' అంతా అబద్దం
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ పైన ఉంది. కరోనా కనుక రాకపోయి ఉంటే ఈపాటికి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యేది. కానీ ఆ పరిస్థితి లేదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాని పాత్రపై కొద్దిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే కుర్రాడి పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్‌ను నాని టీమ్ కొట్టిపారేసింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే.. ఎప్పటిలాగే నాని అదిరిపోయే ఎంటర్టైనింగ్ రోల్లో…