కరోనా నుండి కోలుకున్న రాజమౌళి.. ప్లాస్మా దానానికి టైముంది..!

Rajamouli Recovers From Coronavirus

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళికి.. ఆయన కుటుంబ సబ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు. నాకు.. నా ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ వచ్చింది… వైద్యుల సూచన మేరకు మేము హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ఇక ఈ విషయం చెప్పి రాజమౌళి ఇప్పటికే రెండు వారాలు అయిపోయింది. హోమ్ క్వారంటైన్ పూర్తి అవ్వ‌డంతో మ‌రోసారి టెస్ట్ చేయించుకోగా అందులో అంద‌రికీ నెగిటివ్ వ‌చ్చిందట. ఈ విషయాన్నికూడా రాజమౌళినే స్వయంగా తన ట్విట్టర్ లో తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రెండు వారలు పూర్తయిపోయింది.. మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాం.. అందరికీ నెగిటివ్ వచ్చింది.. అయితే ప్లాస్మా దానం చేయాలని చూస్తున్నాం.. కానీ డాక్టర్లు మూడు వారాలు ఆగాలని.. అప్పుడే ప్లాస్మా దానానికి తగినన్ని యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయని చెప్పారని రాజమౌళి ట్వీట్ లో పేర్కొన్నారు.

 

కాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =