కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 148

సినిమా వార్తలు

'మహేష్' ఛాలెంజ్ ను స్వీకరించిన 'విజయ్'

సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన నివాసంలో మొక్కలు నాటి పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం అంటూ మరో ముగ్గురు స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, నటి శృతిహాసన్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఇక దీనిలో భాగంగా మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించాడు విజయ్. ఈ నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటాడు విజయ్. మహేష్ ఇది నీకోసం... గ్రీనర్ ఇండియా.. గుడ్ హెల్త్ థ్యాంక్యూ అంటూ మొక్కలు నాటుతూ తన ఆ పోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. మహేష్ విసిరినా ఛాలెంజ్ కు శృతి హాసన్ స్పందించి త్వరలో మొక్కలు నాటుతానని తెలిపింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇలియానా '80 డేస్ ఛాలెంజ్'

గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని చెప్పనక్కర్లేదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఇలియానా. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించి చాలా కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే అప్పట్లో ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉండి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు బ్రేకప్ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు బ్రేకప్ అయిందనుకోండి. తన ప్రియుడితో విడిపోయినట్లు తానే తెలిపింది. ప్రస్తుతం సింగిల్ గానే వుంటూ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.

TFN Adminవాట్సాప్
Actress Regina Cassandra Surprises Audience By Taking Live Video Sessions From The Middle Of The Sea.
సినిమా వార్తలు

రెజీనా స్విమ్మింగ్ సర్ ప్రైజ్

15 సంవత్సరాలుగా తన అందం , అభినయం తో తెలుగు , తమిళ ప్రేక్షకులను అలరిస్తూ రెజీనా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను రెజీనా ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ "ఎవరు " మూవీ తో రెజీనా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ తమిళ మూవీ "నెంజిల్ మరప్పదిల్లై " విడుదల కు సిద్ధంగా ఉంది. రెజీనా 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Tamil Super Star Nayanthara To Play The Role Of A Blind Woman In Her New Movie Directed By Vignesh Shivan
సినిమా వార్తలు

అంధురాలి పాత్రలో నయనతార

తెలుగు , తమిళ , మలయాళ భాషల ప్రేక్షకులను 17 సంవత్సరాలుగా అలరిస్తూ నయన తార సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుని లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. నయనతార ప్రస్తుతం "నేత్రికన్ ", "మూకుత్తి అమ్మన్ ", 'అన్నా త్తే "తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సమంత ట్రెండ్ సెట్టర్..!

టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే.. లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక పెళ్లి తరువాత హీరోయిన్లకు పెద్దగా సినిమాలు రావు.. సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది.. కానీ అమ్మడు అదృష్టం ఏంటో కానీ పెళ్లి తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు కదా.. వరుస హిట్లు కొట్టేస్తుంది. అందుకే ఇప్పుడు ఎంతో మందికి సమంత ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Mohan Babu Family Shares Their Family Portrait As His Younger Grand Daughter Ayra Turns One
సినిమా వార్తలు

మంచు ఐరా పుట్టిన రోజు వేడుకల్లో 'మంచు ఫ్యామిలీ'

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు వుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇక ఇప్పుడు ఆయన వారసులుగా విష్ణు, మనోజ్ తెలుగు సినీ పరిశ్రమలో హీరోలుగా తమకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక మోహన్ బాబు గారాల పట్టి లక్ష్మీ కూడా అడపా దడపా సినిమాలు చేస్తూనే బుల్లితెరపై తన స్పెషల్ షోస్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Awe 2 To Hit The Sets Soon
సినిమా వార్తలు

త్వరలో సెట్స్ పైకి 'అ 2'..!

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ పై నాని నిర్మాతగా . ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వచ్చిన సినిమా ‘అ’. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా, రెజీనా ప్రధాన పాత్రల్లో 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఓ కొత్త సినిమా చూశామ‌న్న అనుభూతి ప్రేక్ష‌కుల‌కు క‌లిగింది. పలు అవార్డులను సైతం దక్కించుకుంది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రాశీఖన్నా స్టన్నింగ్ లుక్

మోడల్, యాక్ట్రెస్ , సింగర్ రాశీఖన్నా సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుస లాడే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో రాశీఖన్నా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా సైమా అవార్డ్ అందుకున్నారు. "బెంగాల్ టైగర్ ", "సుప్రీమ్ ", "జైలవకుశ ", "రాజా ది గ్రేట్ ", తొలిప్రేమ మూవీస్ లో ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకున్నారు. రాశీఖన్నా నటించిన "వెంకీ మామ", "ప్రతి రోజూ పండగే " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మళ్ళీ రైటర్ గా పవన్ కళ్యాణ్ ?

మల్టీ ట్యాలెంటెడ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోనే కాకుండా చిత్ర పరిశ్రమలో పలు విభాగాలలో తన ప్రతిభను కనపరిచారు . "జానీ "మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే సమకూర్చి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. "సర్దార్ గబ్బర్ సింగ్ " మూవీ కి స్టోరీ , స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ అందించారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన "డాడీ " మూవీ లో ఒక ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ కంపోజ్ చేశారు . "అత్తారింటికి దారేది ", "అజ్ఞాతవాసి " మూవీస్ కు పవన్ కళ్యాణ్ గాయకుడు గా మారారు. "జనసేన "పొలిటికల్ పార్టీ స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్లాస్మా డొనేషన్ పై మ‌హేష్ పిలుపు

కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మద్దతు పలుకుతూ వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన చేపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే స్పందించి ప్లాస్మా డొనేషన్ చేయాలని కోరారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ప్లాస్మా డొనేషన్ పై పిలుపనిచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అక్కా చెల్లెళ్ళు గా సమంత , రష్మిక ?

స్టార్ హీరోయిన్ సమంత , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక అక్కా చెల్లెళ్ళు గా ఒక మూవీ లో నటిస్తున్నారని సమాచారం. ఇటీవల ఒక యువదర్శకుడు అక్కా చెల్లెళ్ళు కథ తో సమంత , రష్మిక లను సంప్రదించారని, కథ వినగానే ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఇద్దరు ట్యాలెంటెడ్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారనే వార్త అభిమానులలో సంతోషం కలిగించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్లాస్మా డొనేషన్ కై చిరంజీవి పిలుపు

కరోనా మహమ్మారి వ్యాధి నుండి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మా తో మరికొంతమంది ప్రాణాలు రక్షించవచ్చనే విషయం తెలిసిందే. కరోనా నుండి కోలుకున్న వారి ప్లాస్మా దానానికై సైబరాబాద్ కమిషనరేట్ లో సి పి సజ్జనార్ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్లాస్మా దానం చేసిన కొంతమంది దాతలను సజ్జనార్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మెగా స్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

Team TFNవాట్సాప్
RRR Producer DVV Danayya Tested Positive For Coronavirus
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ కు కూడా కరోనా పాజిటివ్

టాలీవుడ్ సెలబ్రిటీస్ ను కరోనా వదలట్లేదు. రోజుకో సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నారు. బండ్ల గణేష్ మొదలుకుని, రాజమౌళి ఫ్యామిలీ, స్మిత, ఎస్.పి. బాలు ఇలా టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ సోకిన వారిలో ఉన్నారు. ఇక తాజాగా మరో సెలబ్రిటీకి కరోనా సోకింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు ఆర్ఆర్ఆర్ నిర్మాత. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్యకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లుగా తెలుస్తుంది. అయితే రాజమౌళికి కరోనా రావడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ నిమిత్తం రాజమౌళిని దానయ్య కలిసుండవొచ్చు అందుకే వచ్చిందేమో అంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి కన్నుమూత

గతకొద్దిరోజులుగా కరోనా సినీ పరిశ్రమను బాగా దెబ్బతీసింది అని వింటూనే ఉన్నాం. ఒకపక్క షూటింగులు, రిలీజ్ లు లేక బిజినెస్ సరిగా జరగగా కోట్లలో నష్టం వస్తుంటే.. మరోపక్క ఎంతో మంది నటీనటులు ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏదైనా కానీ ఈ ఏడాదిలో అది కూడా కరోనా స్టార్ట్ అయిన తర్వాత సినీ పరిశ్రమల్లో చూసిన చావులు ఎప్పడూ చూడలేదంటే అతిశయోక్తి కాదు. లెజెండ్రీ నటీనటుల దగ్గర నుండి యువ నటీనటులు ఎంతో మంది తనువు చాలించారు. ఇప్పుడు మరో సంఘటన చోటుచేసుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బ్లడ్ ప్లాస్మా దానం చేయండి -నాని

భారత దేశంలో 18 లక్షలమంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సుమారు 38 వేల మంది ప్రాణాలు కోల్పోయారు . ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 2లక్షల 35 వేల మంది పై కరోనా ప్రభావంచూపింది. చాలా మంది కరోనా నుండి కోలుకున్నారు. కొవిడ్ -19 నుండి కోలుకున్నవారి బ్లడ్ ప్లాస్మా తో కరోనా బాధితులను రక్షించవచ్చని డాక్టర్స్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో హీరో నాని బ్లడ్ ప్లాస్మా దానానికై పిలుపునిచ్చారు.

Team TFNవాట్సాప్
Naveen Polisetty Agent Sai Srinivasa Athreya Goes To Japan
సినిమా వార్తలు

జపాన్ లోకి 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌'

గత ఏడాది వచ్చిన 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ‘షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్రా.. కానీ ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్’ అంటూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు నవీన్ పోలిశెట్టి.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Shares A Cute Dance Video Of His Daughter Sitara On Instagram
సినిమా వార్తలు

మహేష్ బాబు తనయ సితార డ్యాన్స్ వీడియో

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్నారు . మహేష్ బాబు తనయ సితార డ్యాన్స్ చేసిన పలు సాంగ్ వీడియోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్టార్ కిడ్ సితార డ్యాన్స్ చేసిన సాంగ్ వీడియో ను మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో లో సితార డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి .

Team TFNవాట్సాప్
Actress Shruti Haasan Shares A Video Glimpse Of Her Quarantine Life On Social Media
ట్రైలర్ & టీజర్

లాక్ డౌన్ లో సింగిల్ లైఫ్ ఇలా..!

లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అందరూ ఇంట్లోనే వుంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ కూడా కొత్త కొత్త వంటలు.. ఆన్లైన్ క్లాసెస్.. వర్కౌట్స్ అంటూ దొరికిన సమయాన్ని బాగానే ఉపయోగించుకుంటున్నారు. అలాగే లాక్ డౌన్ లోనే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటూ తమ అప్ డేట్స్ ఇస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Actress Tamannaah Shares Her Perspective Regarding Resuming Movie Shootings Post Lockdown.
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ పునః ప్రారంభం పై తమన్నా అభిప్రాయం

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. దాదాపు 3 నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని షరతులతో కూడిన షూటింగ్స్ అనుమతినిచ్చినా ఒకటి , రెండు చిన్న చిత్రాలు తప్ప పెద్ద సినిమాలు సెట్స్ కు వెళ్ళలేదు. స్టార్ , హీరో , హీరోయిన్స్ ఈ పరిస్థితులలో షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదు. 4 నెలలకు పైగా ఇంటికే పరిమితం అయిన తమన్నా సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , తన ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Yatra Movie Director Mahi V Raghav To Make A Webseries Based On The Real Life Story Of Gangster Dawood Ibrahim
సినిమా వార్తలు

మహి వి రాఘవ్ సాహస నిర్ణయం

సక్సెస్ ఫుల్ "ఆనందో బ్రహ్మ ", "యాత్ర " మూవీస్ తో అలరించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రముఖ OTT ద్వారా ఈ వెబ్ సిరీస్ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో ప్రసారం కానుంది.

Team TFNవాట్సాప్

షేర్