మహేష్-విజయ్ ఫ్యాన్స్ కు వివేక్ రిక్వెస్ట్..!

Tamil Star Comedian Vivekh Request Fans Of Star Actors Not To Compare Mahesh Babu and Vijay

తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమానికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రంలో పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా ఇతరుల చేత కూడా నటిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా ఇటీవ‌లే మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వయంగా స్వీకరించి మొక్కలు నాటిన సంగతి తెలిసిందే కదా. అనంతరం ఈ ఛాలెంజ్ ను ఎన్టీఆర్, విజ‌య్‌, శృతి హాస‌న్‌ని నామినేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించిన విజయ్ చెన్నైలోని త‌న నివాసంలో మొక్క‌లు నాటారు. ఇక దీనితో ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తూ తమ హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనిపై తమిళ్ కమెడియన్ వివేక్ స్పందించి ఇద్దరు స్టార్స్ పై ప్రశంసలు కురిపించాడు.. అలానే ఈ సందర్భంగా ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ కు కూడా ఒక రిక్వెస్ట్ చేశారు. మహేష్ బాబు సర్, విజయ్ సర్ కు మిలియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు… నేచర్ ను కాపాడటానికి వారు మంచి పని చేసినప్పుడు ఫ్యాన్స్ గా మీరు కూడా వారు చేసిన మంచి పని నుండి ఇన్స్పైర్ అవ్వాలి అంతేకానీ ఒకరితో ఒకరిని కంపేర్ చేయకండి.. మన ముఖ్య లక్ష్యం భూమి పచ్చగా ఉండటమే అని కోరారు.

 

కాగా వివేక్ శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 5 =