ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ప్రవేశించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. సోషల్ మీడియా లో ప్రతిభను చాటుకునేవారికి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. టాలెంట్ ఉండీ అవకాశాలు రాని వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి దర్శకుడు శైలేష్ కొలను అద్భుతమైన అవకాశం కల్పించారు. ఇంట్లోనే ఉండి ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని, తమకు నచ్చిన సీన్ లో నటించిన వీడియో ను మెయిల్ చేయమని , ఒక వేళ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తే ఆ వీడియోలు ఆడిషన్స్ @ శైలేష్ కొలను .కామ్ కు పంపించమని , పర్సనల్ గా వాటిని పరిశీలించి, తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటానని శైలేష్ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “HIT ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ హిందీ భాష లో రీమేక్ కానుంది. శైలేష్ ఇప్పుడు “HIT ” మూవీకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు. కరోనా క్లిస్ట పరిస్థితులలో కొంతమంది దర్శకులు ఆన్ లైన్ లో ఆడిషన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ హీరోగా రూపొందించే “అలిమేలు మంగ వెంకటరమణ “మూవీ కి సీనియర్ దర్శకుడు తేజ ఆన్ లైన్ ద్వారా ఆడిషన్స్ నిర్వహించారు. శైలేష్ కొలను ఇచ్చిన అద్భుత ఆఫర్ కు స్పందించి న్యూ టాలెంట్ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: