మెగా కాంపౌండ్ నుండి వెండి తెరకు పరిచయమవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇప్పటికే ‘ఉప్పెన’ సినిమా తెరకెక్కింది. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది.. ఎప్పుడో వైష్ణవ్ తేజ్ వెండి తెరకు పరిచయం అయ్యేవాడు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే సినిమాపై మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు రెండో సినిమాకు కూడా సిద్దమయ్యాడు. క్రిష్ జాగర్లమూడితో వైష్ణవ్ తేజ్ సినిమా చేస్తున్నట్టు గత కొద్దీ రోజుల నుండి పలు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయింది. ఈ రోజే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం కూడా పూర్తయ్యినట్టు తెలుస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించడం.
ఇక క్రిష్ పవన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకా టైం పడుతుంది. దీనితో ఈ గ్యాప్ లో ఈ సినిమా పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడట. రేపటినుండే షూటింగ్ ను మొదలు పెట్టాలని.. పరిస్థితులు బాలేవు కాబట్టి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడట.
కాగా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: