ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 146
‘ఆది పురుష్’ లో శూర్పణఖ గా..?

#NBK106 మూవీ కి కొత్త టైటిల్ ?
'ఆది పురుష్' లో ప్రభాస్ కు సరైన జోడి?

#Prabhas 21 " మూవీలో కీలక పాత్రలో నివేద థామస్ ?
"బంగార్రాజు " మూవీ లో సమంత గెస్ట్ రోల్ ?
ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి
ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ సీడీపీ వరల్డ్ రికార్డ్
చరణ్ చేతుల మీదుగా చిరు కామన్ డీపీ
రజినీ-కమల్ సినిమా ప్రకటన అప్పుడే..!

సోషల్ మీడియా ట్రెండింగ్ లో టీజర్
శ్రీహరి తనయుడితో సతీశ్ వేగేశ్న కొత్త సినిమా
కోలుకుంటున్న ఎస్పీ బాలు
ఈ వారం మూవీ అప్ డేట్స్ - డోంట్ మిస్..!

విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి
బిగ్ బాస్ 4 లో ఎంట్రీ..?
వెబ్ సిరీస్ లో అతిథి పాత్రలో కియారా అద్వానీ
స్టార్ హీరో మమ్ముట్టి వర్కౌట్ సెల్ఫీ
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో సుమారు 400 మూవీస్ లో నటించి ,4దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. పద్మశ్రీ పురస్కారం తో పాటు బెస్ట్ యాక్టర్ గా 3 నేషనల్ , 7 కేరళ స్టేట్ , 12 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ మమ్ముట్టి అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ "యాత్ర " మూవీ లో వై ఎస్ ఆర్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
‘ఆది పురుష్’ లో శూర్పణఖ గా..?
ఈరోజు ఉదయాన్నే తన అభిమానులకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడు రెబల్‌స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ 21 సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చి కూడా చాలా కాలమైంది.

#NBK106 మూవీ కి కొత్త టైటిల్ ?
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ అని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ లో అమలా పాల్ ఒక కథానాయిక కాగా మరో కథానాయిక గా ఒక కొత్త నటి పరిచయం కానున్నారు.
'ఆది పురుష్' లో ప్రభాస్ కు సరైన జోడి?
అలా ప్రభాస్ 22 అప్ డేట్ వచ్చిందో లేదో ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యంలేదు. ప్రభాస్ హీరోగా ఓంరావుత్ దర్శకత్వంలో ‘అదిపురుష్’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. ‘చెడుపై మంచి సాధించే విజయం' అనేది సినిమా ఇతివృత్తం. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇది మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతుందన్న విషయం అర్థమైంది. పోస్టర్లో రాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలను ఎలివేట్ చేశారు. పాన్ ఇండియా మూవీగా సినిమాను హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మించనున్నారు.

#Prabhas 21 " మూవీలో కీలక పాత్రలో నివేద థామస్ ?
తమిళ , మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నివేద థామస్ , సూపర్ హిట్ "జెంటిల్ మన్ " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. "నిన్నుకోరి ", "జై లవకుశ ", "118 ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేద హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. నివేద ప్రస్తుతం "వకీల్ సాబ్ " మూవీ తోపాటు మరో రెండు తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు.
"బంగార్రాజు " మూవీ లో సమంత గెస్ట్ రోల్ ?
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో నటించిన సమంత, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో గెస్ట్ రోల్ లో నటించనున్నారని సమాచారం.
'ప్రభాస్ 22' టైటిల్ పోస్టర్ రిలీజ్
గత కొద్దినెలల ముందు అయితే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టు.. ఒక్క అప్ డేట్ ఒకే ఒక్క ప్రభాస్ సినిమా అప్ డేట్ అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా కూడా కష్టంగా ఉండేది. అయితే ఈ మధ్య కాస్త పంథా మార్చారు. ప్రభాస్ 20 రాధేశ్యామ్ సినిమా అప్ డేట్ ఇచ్చిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఎలాంటి హడావుడి లేకుండా ప్రభాస్ 22 సినిమా అప్ డేట్ ఇచ్చి షాకిచ్చారు.
రజినీకాంత్ మొదటి తెలుగు సినిమా ఏంటో మీకు తెలుసా..?
నీ నడకల స్టైయిలదిరే.. నీ నవ్వుల కైపదిరే.. నీ మాటల తీరదిరే.. నీ చూపుకు ఎద అదిరే అంటూ బాషా సినిమాలో నగ్మా రజినీని ఊహించుకుంటూ పాట పడుతుంది. ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే..' ఈ పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఆ పాటకు తగ్గట్టే రజనీ ఏం చేసినా అది స్టయిలే. ఆ నడకలో ఓ స్టయిల్... సిగిరెట్ ఎగరేయడం ఓ స్టయిల్... కూలింగ్ గ్లాస్‌ని కూల్‌గా ఎగరేయడం ఓ స్టయిల్ ఇలా చేయడం ఆయనకు మాత్రమే సాటి. ఆ స్టయిల్ నచ్చే కదా సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. తమిళ్, తెలుగు, హిందీ ఒక్క భాష కాదు.. ఒక్క దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు. ఆ హీరో ఎవరో ఈ పాటికే అర్దమైఉంటది. తలైవా రజినీ కాంత్.
ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి
టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఎస్పీ బాలుకు కూడా కరోనా సోకిన సంగతి కూడా విదితమే. కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఎస్పీ బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించి... ఎస్పీ బాలు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం…
ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ సీడీపీ వరల్డ్ రికార్డ్
"అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పవన్ కళ్యాణ్ ", "బద్రి ", తొలిప్రేమ ", ఖుషి ", జల్సా ", "గబ్బర్ సింగ్ ", "అత్తారింటికి దారేది "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ "అజ్ఞాత వాసి " మూవీ తరువాత పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. ప్రజా సేవ కై "జనసేన " పార్టీ ని స్థాపించారు. దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ "వకీల్ సాబ్ "రూపొందుతుంది. "వకీల్ సాబ్ " మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఒక సాంగ్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.
చరణ్ చేతుల మీదుగా చిరు కామన్ డీపీ
స్టార్ హీరోల పుట్టినరోజులు అంటే ఫ్యాన్స్ కు పండగే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు ఘనంగా వేడుకలు చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సెలెబ్రేషన్స్ కు బ్రేక్ పడింది. అలా అని ఫ్యాన్స్ సైలెంట్ గా ఉండరు కదా. ఏదో ఒకటి కొత్తగా చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో చిరు బర్త్ డే కూడా తొందరలోనే రానుంది కనుక ఫ్యాన్స్ కూడా ఇప్పటినుండే హడావుడి మొదలుపెట్టారు. ఇప్పటి నుంచే చిరు అభిమానులు సోషల్ మీడియాలో వేడుకలకు తెరలేపేశారు. ఇప్పటికే కొంతమంది అభిమానులు చిరంజీవికి…

అశోక్ గల్లా మూవీ నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్
"మున్నా మైఖేల్ " మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన బెంగుళూరు బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో "సవ్యసాచి ", "Mr మజ్ను " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తిపు పొంది నిధి పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. "భూమి " మూవీ తో తమిళ , "జేమ్స్ " మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమలకు నిధి పరిచయం అవుతున్నారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. నిధి హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
రజినీ-కమల్ సినిమా ప్రకటన అప్పుడే..!
‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్.. కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

సోషల్ మీడియా ట్రెండింగ్ లో టీజర్
మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూర్ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ గ్రహీత "మహానటి "కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఒక పల్లెటూరి యువతి జాతీయ స్థాయిలో షూటర్ గా మారిన నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది .
శ్రీహరి తనయుడితో సతీశ్ వేగేశ్న కొత్త సినిమా
‘శతమానం భవతి’ సినిమాతో నేషనల్ జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఇప్పుడు కుర్ర హీరోలతో మరో కొత్త సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఒక హీరోగా శ్రీహరి తనయుడు మేఘాంష్ కాగా మరో హీరోగా సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్నను హీరోగా పరిచయం చేయనున్నారు. ఇంతవరకూ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ విలువలతో సినిమాలు తీసిన సతీష్ వేగ్నేశ ఇప్పుడు ఈ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ చిత్రం తెరకెక్కించబోతున్నారు. దివంగత శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ నిర్మించనున్నారు.
కోలుకుంటున్న ఎస్పీ బాలు
కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు రావడంతో.. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. త్వరలోనే కోలుకుంటానని అభిమానులకు తానే స్వయంగా వీడియో ద్వారా సమాచారాన్ని అందించారు కూడా. అయితే నాలుగు రోజుల క్రితం ఎస్పీ బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నామని.. నిపుణులైన డాక్టర్లు ఆయనని పర్యవేక్షిస్తున్నారని చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇక దీనితో టాలీవుడ్ సినీ ప్రముఖులు బాలు తొందరగా కోలుకోవాలని అందరూ…
ఈ వారం మూవీ అప్ డేట్స్ - డోంట్ మిస్..!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా ఒక లుక్కేయండి.

విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి
ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించిన పలువురు నటులు, సింగర్స్, దర్శకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వీరిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియాలో రీసెంట్ గా ఓ వీడియో షేర్ చేసి తెలిపారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ప్రస్తుతం తాను చెన్నైలోని ఎంజీఎం అనే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బిగ్ బాస్ 4 లో ఎంట్రీ..?
‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువై ఆ తరువాత ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేసింది లాస్య. తన అమాయకత్వంతో, అల్లరితో బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ కాస్త స్పీడ్ గా ఉన్నప్పుడే మంజునాథ్ ను వివాహం చేసుకుంది లాస్య. వారికి ఒక బాబు కూడా వున్నాడు. ప్రస్తుతం భర్త, బిడ్డతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తుంది. అయితే వివాహం తరువాత అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో లో కనిపించలేదు. అయితే తన యూ ట్యూబ్ ఛానల్ తో పలు వంటకాలు, టిప్స్ చెపుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇటీవలే మళ్ళీ తెరపై కొన్ని షోస్‌లో అక్కడక్కడా కనిపిస్తోంది.
వెబ్ సిరీస్ లో అతిథి పాత్రలో కియారా అద్వానీ
బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి " హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " మూవీ లో కియారా హీరోయిన్ గా నటించారు. రికార్డ్ కలెక్షన్స్ తో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "కబీర్ సింగ్ " మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు. కియారా హీరోయిన్ గా నటించిన "లక్ష్మీ బాంబ్ ", "ఇందూ కి జవానీ "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.