నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీతో సాయి పల్లవి తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యారు. “ఫిదా ” మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఫిదా చేసి, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సాయి పల్లవి నటించిన తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సాయి పల్లవి ప్రస్తుతం “లవ్ స్టోరీ “, “విరాటపర్వం ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి సమయం దొరికితే తనకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. లాక్ డౌన్ సమయంలో తన తల్లి తో కారులో తిరుగుతూ తొలకరి జల్లులలో తడిసిన ఫోటోలు సాయి పల్లవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులను అలరించారు. జైపూర్ కోటలలో తిరిగి ఎంజాయ్ చేసిన సాయి పల్లవి రాజ్ పుత్ రాణి గెటప్ లో ఉన్న తన త్రో బ్యాక్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: