సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరో గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “డాన్ శ్రీను “, “బలుపు ” మూవీస్ తరువాత హీరో రవితేజ , దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “క్రాక్ ” రూపొందుతుంది. “క్రాక్ ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో రవితేజ 66 వ మూవీ గా రూపొందుతున్న “క్రాక్ ” మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 4నెలలుగా థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితులలో కొంతమంది నిర్మాత , దర్శకులు OTT లో మూవీస్ రిలీజ్ కై ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో దర్శకుడు గోపీచంద్ మలినేని “క్రాక్ ” మూవీ థియేటర్స్ లోనే రిలీజ్ కానుందని ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: