నాని ‘బైపోలార్ డిజార్డర్‌’ అంతా అబద్దం

Nani Team Quashes Rumors About His Character In Tuck Jagadish Movie

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ పైన ఉంది. కరోనా కనుక రాకపోయి ఉంటే ఈపాటికి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యేది. కానీ ఆ పరిస్థితి లేదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాని పాత్రపై కొద్దిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే కుర్రాడి పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్‌ను నాని టీమ్ కొట్టిపారేసింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే.. ఎప్పటిలాగే నాని అదిరిపోయే ఎంటర్‌టైనింగ్ రోల్‌లో కనిపిస్తారని.. నాని పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడైనా ఈ రూమర్స్ ఆగుతాయేమో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్ను కోరి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీనితో అదే కాంబినేషన్ లో రూపొందనున్న “టక్ జగదీష్ ” మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.

దీనితో పాటు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘వి’. ‘వి’ విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. కరోనా వల్ల థియేటర్స్ మూతపడటంతో రిలీజ్ వాయిదాపడింది. కాగా ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =