సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకుముందు ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తుంది నాగశౌర్య మేకోవర్ చూస్తుంటే. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని చుస్తున్నారట. మొదటి షెడ్యూల్ లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరపనున్నారట. కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
దీనితో పాటు పలు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. . నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది. అవసరాల శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా లైన్లో పెట్టాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: