ఈ పరిస్థితిలో థియేటర్స్ ఓపెన్ చేస్తే వెళతారా? వెళ్ళరా?

Would You Go To A Movie Theater Once The Theaters Are Open After The Lockdown?

2020 ఇలా ఉంటుందని ఎవరూ ఉహించనుకూడా ఉండరు. కరోనా వచ్చినా ఏదో రెండు మూడు నెలలు ఉంటుందేమో అని అనుకున్నారు కానీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. ఇక ఈ కరోనా వల్ల ఎన్నో పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినీపరిశ్రమకు కొన్ని కోట్లలో నష్టం కలిగింది. షూటింగ్స్ ఎలాగూ లేవు.. కనీసం థియేటర్స్ అయినా ఓపెన్ అవుతాయా.. ఆ బిజినెస్ అన్నా జరుగుతుందా అంటే అదీ లేకుండా పోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు అసలు సమస్య అంత ఇప్పటికే షూటింగ్ లు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలదే. అందులో కూడా చిన్న సినిమాలు అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఓటీటీ లో రిలీజ్ చేసుకుంటున్నారు. ఒక రకంగా థియేటర్స్ కంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఏ బెటర్ అని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాలు ఆర్ఆర్ఆర్, కెజియఫ్2 లాంటి సినిమాలు కాస్త లేట్ అయిన థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అవుతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే మీడియం బడ్జెట్ సినిమాల పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. అటు ఓటీటీలో రిలీజ్ చేసుకోలేరు.. ఇటు థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వుండలేరు.

లాక్ డౌన్‌లో సడలింపులు అయితే జరిగాయి కానీ సినిమా థియేటర్స్ తప్ప దాదాపు అన్నింటికి అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. మధ్యలో రెండు మూడు సార్లు థియేటర్స్ తెరిచే విషయంపై చర్చ జరిగినా కూడా ఇప్పటి వరకు అయితే అది కార్యరూపం దాల్చలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది సినిమా థియేటర్స్ అన్నీ మూత పడ్డాయి. అయితే ఇక్కడ కూడా సెప్టెంబర్ నుండి థియేటర్స్ ఓపెన్ అవుతాయన్న టాక్స్ వినిపిస్తున్నాయి. అంటున్నారు కానీ ఒకపక్క ఆలోచిస్తూనే వున్నారు.

ఇక ఈ న్యూస్ సినీ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేదే. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నిరోజులు సినిమాను థియేటర్లో చూడకుండా ఎంత మిస్ అయ్యారో ఇప్పటికే ఎంతో మంది మాటల్లో విన్నాం. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ధైర్యం చేసి థియేటర్స్ ఓపెన్ చేస్తే మీరు థియేటర్ కు వెళ్లి చూస్తారా..? చూడరా..? మీ అభిప్రాయం ఏంటో మీ ఓటు ద్వారా తెలపండి.

ఈ పరిస్థితిలో థియేటర్స్ ఓపెన్ చేస్తే వెళతారా? వెళ్ళరా?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + ten =