బ్రేక్ తర్వాత ‘వకీల్ సాబ్’ వర్క్

Music Director SS Thaman Gets Back To Work On Vakeel Saab Movie After Taking A Small Break

పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది. పవన్ ఇంకో సినిమాను కూడా మొదలు పెట్టి ఉండేవి. అయితే కరోనా వల్ల పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. వకీల్ సాబ్ షూటింగ్ కూడా వాయిదా పడింది. కనీసం అప్ డేట్ కూడా లేకుండా పోయింది. దీనితో వకీల్ సాబ్ నుంచి ఒక్క అప్డేట్ అయినా రావాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజు కావడంతో ఆరోజైన ఈ సినిమా నుండి అప్ డేట్ వస్తుందేమో అని చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై థమన్ అప్ డేట్ ఇచ్చి కాస్త ఫ్యాన్స్ కు ఊరట నిచ్చాడు. బ్రేక్ తర్వాత వకీల్ సాబ్ సినిమా వర్క్ స్టార్ట్ అవుతుందని.. పవర్ స్టార్ అంటే ఆ ఎనర్జీ డిఫరెంట్ గా ఉంటుందని తన ఇన్స్టాగ్రామ్ లో తెలిపాడు.

 

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.