బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న “చందమామ కథలు ” మూవీ తో నాగశౌర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఊహలు గుస గుస లాడే “, “దిక్కులు చూడకు రామయ్య “, “కల్యాణ వైభోగమే “, “ఛలో “, “ఓ బేబీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. “అశ్వథ్థామ” మూవీ లో యాక్షన్ సీన్స్ లో నాగశౌర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలువిద్య నేపథ్యంలో రూపొందున్న స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




క్యూట్ గా , చాక్లెట్ బాయ్ లా ఉండే నాగశౌర్య సిక్స్ ప్యాక్ అబ్స్ తో ప్రేక్షక , అభిమానులను ఆశ్చర్యపరిచారు. సిక్స్ ప్యాక్ అబ్స్ గురించి నాగశౌర్య మాట్లాడుతూ .. #NS20 మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న తనను దర్శకుడు సంతోష్ ఫిట్ గా ఉండాలని కోరడంతో సిక్స్ ప్యాక్ చేస్తే ఈ మూవీ కి అడ్వాంటేజ్ అవుతుందని లాక్ డౌన్ కు ముందే సిక్స్ ప్యాక్ కై ట్రై చేశానని , అందుకు లాక్ డౌన్ సమయం కలసివచ్చిందని చెప్పారు. అయితే నాగశౌర్య సిక్స్ ప్యాక్ తో ఆగకుండా 8ప్యాక్ సాధించారు. ప్రస్తుతం 10 ప్యాక్ కై ప్రయత్నిస్తున్నట్టు నాగశౌర్య తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: