సంజయ్ భాయ్ మీరొక ఫైటర్

Megastar Chiranjeevi's Wishes For Sanjay Dutt

సంజయ్ దత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజుల క్రితం ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడటంతో హాస్పిటల్ లో చేరగా అక్కడ సంజయ్ దత్ కు కరోనా పరీక్షలు చేశారు. అయితే కరోనా నెగిటివ్ వచ్చింది కానీ లంగ్ క్యాన్సర్ అని తేలింది. దీనితో త్వరలోనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. అంతేకాదు చికిత్స నిమిత్తం తాను షూటింగ్‌‌ల నుంచి విరామం తీసుకుంటున్నానని, అయితే తన అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. తన ఆరోగ్యంపై వచ్చే ఎలాంటి రూమర్స్ ను నమ్మవద్దని త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తానని ట్వీట్ కూడా చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. సంజయ్ దత్‌ కు క్యాన్సర్ అని తెలియగానే చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. తాజాగా మెగాస్టార్ కూడా తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘డియరెస్ట్ సంజయ్ దత్ భాయ్, మీరు ఇలాంటి అనారోగ్య పరిస్థితిలో వున్నందుకు చాలా బాధగా ఉంది..కానీ మీరొక ఫైటర్.. గడిచిన ఏళ్లలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలబడ్డారు. ఇప్పుడు కూడా మీరు దీన్ని జయిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు త్వరగా కోలుకోవాలని మేమంతా ప్రార్థిస్తున్నాం’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

కాగా చిరంజీవితో సంజయ్ దత్‌కు మంచి అనుబంధం ఉంది. సంజయ్ దత్ తీసిన మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమానే తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాగా రీమేక్ చేసాడు. ఇంకా రామ్ చరణ్ ‘జంజీర్’ సినిమాలో కూడా సంజయ్ దత్ షేర్ ఖాన్ పాత్ర పోషించారు.

ప్రస్తుతం సంజయ్ దత్‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీర పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా కేజీఎఫ్ 2 మూవీ అధీర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =