విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి

Legendary Singer SP Balasubrahmanyam Health Condition Gets Critical

ఇప్ప‌టికే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు న‌టులు, సింగ‌ర్స్, ద‌ర్శ‌కులు క‌రోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వీరిలో గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తానే సోష‌ల్ మీడియాలో రీసెంట్ గా ఓ వీడియో షేర్ చేసి తెలిపారు. జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోగా క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ అయింది. ప్ర‌స్తుతం తాను చెన్నైలోని ఎంజీఎం అనే ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి బాలు ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఐసీయూకి తరలించినట్లుగా తెలుస్తుంది. ఎస్పీ బాలు ఆరోగ్యానికి సంబంధించిన ఎంజీఎం ఆసుపత్రి ఒక బులిటెన్ ను విడుదల చేయడంతో అసలు విషయం తెలిసింది. నిపుణులైన డాక్టర్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను పర్యవేక్షిస్తున్నారు అని.. ప్రస్తుతం ఐసీయూ లో లైఫ్ సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్తితి మరింత క్రిటికల్ గా ఉంది అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఇక ఈవార్త బయటకు రావడంతో సినీ ప్రముఖులు ఆయన తొందరగా కోలుకోవాలని కోరుతున్నారు. థమన్ ,దేవి శ్రీ ప్రసాద్ తమ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మన ప్రార్థనలు ఆయనకు తోడుగా ఉంటాయి.. నేను ఇంకా చాలా పాటలు రాయాలి.. తప్పకుండా ఆరోగ్యంతో తిరిగి వస్తారు.. ఎన్నో పాటలు పాడతారు.. మీరు ఫైట్ చేసి తప్పకుండా విజయం సాధిస్తారు.. అని థమన్ ట్వీట్ చేసాడు.

మరోవైపు దేవి శ్రీ ప్రసాద్.. గాడ్ ఆఫ్ సింగింగ్ కోసం అందరం ప్రార్థనలు చేద్దాం.. మీ అద్భుతమైన గొంతుతో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు మాకు తెలుసు అంటూ ట్వీట్ చేసాడు.

ఇక పాటల రచయిత రామ జోగయ్యశాస్త్రి కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. దేవుడా..నా దేవుడి జోలికి రాకు.. మీరు తొందరగా రికవర్ అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =