ఈరోజు ఉదయాన్నే తన అభిమానులకు బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు రెబల్‌స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ 21 సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చి కూడా చాలా కాలమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రభాస్ 22 సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండబోతున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. తన 22 వ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. ఇటీవల తానాజీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న ప్రముఖ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నారు. ఈ సినిమాకు ‘ఆది పురుష్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయం అనే థీమ్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనుండగా.. భూషణ్ కుమార్, ప్రశాంత్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా 3Dలో రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉండగా మంచు లక్ష్మీ తన ట్విట్టర్ లో దీనిపై స్పందించింది. ప్రభాస్ ‘ఆది పురుష్’ సినిమా పోస్టర్ ఆసక్తి రేపుతోంది.. 3d లో సినిమాను చూసి సెలెబ్రేట్ చేసుకుందాం అంటూ ట్వీట్లో పేర్కొంది. అయితే మంచు లక్ష్మీ ట్వీట్ కు ప్రభాస్ ఫ్యాన్ స్పందించి ఓం రౌత్ ను ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో మిమ్మల్ని తీసుకోమని చెప్తా అంటూ ట్వీట్ చేసాడు. దీనికి మళ్ళీ లక్ష్మీ కామెడీ గా స్పందించి వావ్.. నేను కూడా ఉన్నా.. ఎక్కడ సైన్ చేయాలి అంటూ ట్వీట్ చేసింది. చూద్దాం మరి ఈ సినిమాలో లక్ష్మీకి ఏదైనా రోల్ లో నటించే అవకాశం దక్కుతుందేమో.
Woahhhh!!!!! I’m in. Where do I sign?
— Lakshmi Manchu (@LakshmiManchu) August 18, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: