ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ అని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ లో అమలా పాల్ ఒక కథానాయిక కాగా మరో కథానాయిక గా ఒక కొత్త నటి పరిచయం కానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో పవర్ ఫుల్ టైటిల్స్ తో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ #NBK106 కు టైటిల్ గా సూపర్ మేన్ , మొనగాడు , మోనార్క్ వంటి టైటిల్స్ గా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో టైటిల్ తెర మీదకు వచ్చింది. #NBK106 మూవీ కి టైటిల్ “బొనాంజ ” పరిశీలనలో ఉందని సమాచారం. #NBK106 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: