బిగ్ బాస్ 4 లో ఎంట్రీ..?

Anchor Lasya Was Chosen As One Of The Final Contestants In Bigg Boss Season 4

‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువై ఆ తరువాత ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేసింది లాస్య. తన అమాయకత్వంతో, అల్లరితో బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక కెరీర్ కాస్త స్పీడ్ గా ఉన్నప్పుడే మంజునాథ్ ను వివాహం చేసుకుంది లాస్య. వారికి ఒక బాబు కూడా వున్నాడు. ప్రస్తుతం భర్త, బిడ్డతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తుంది. అయితే వివాహం తరువాత అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో లో కనిపించలేదు. అయితే తన యూ ట్యూబ్ ఛానల్ తో పలు వంటకాలు, టిప్స్ చెపుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇటీవలే మళ్ళీ తెరపై కొన్ని షోస్‌లో అక్కడక్కడా కనిపిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బుల్లితెరపై మళ్లీ బిగ్‌బాస్ సందడి మొదలు కానుంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ 4 త్వరలోనే ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో లో లాస్య కూడా ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపు లాస్య పేరు ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే లాస్య కనుక ఈ షో లో ఉంటే ఖచ్చితంగా తన అల్లరితో ఎంటర్టైన్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంతో ప‌క‌డ్భందీగా బిగ్ బాస్4 షోను నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు నిర్వాహ‌కులు. ఇప్పటికే ఓ ప్రోమోను రిలీజ్ చేసింది కూడా స్టార్ మా. కాగా బిగ్ బాస్‌-4 షోలో మొత్తం 16 మంది పాల్గొన‌బోతుండ‌గా మ‌రోసారి హోస్ట్‌గా నాగార్జున‌ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. యాథావిధిగా 106 రోజుల పాటు ఈ షో జ‌ర‌గ‌నున్నట్టు తెలుస్తుంది.

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ షో ‘బిగ్‌ బాస్’. ఇప్పటి వరకు తెలుగులో ఇంత భారీ బడ్జెట్‌ షో రాలేదు. దీనికి తోడు తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత కావడంతో మరింత పాపులారిటీ వచ్చింది. సీజన్ 2 కు నాని, సీజన్ 3 కి నాగార్జున లాంటి స్టార్స్ వ్యాఖ్యతలుగా చేయడంతో ఈ షోకి మరింత క్రేజ్ పెరిగింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =