చరణ్ చేతుల మీదుగా చిరు కామన్ డీపీ

Ram Charan Tej To Unveil Common Display Picture Of Mega Star Chiranjeevi On His Birthday

స్టార్ హీరోల పుట్టినరోజులు అంటే ఫ్యాన్స్ కు పండగే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు ఘనంగా వేడుకలు చేద్దామా అని ఎదురుచూస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సెలెబ్రేషన్స్ కు బ్రేక్ పడింది. అలా అని ఫ్యాన్స్ సైలెంట్ గా ఉండరు కదా. ఏదో ఒకటి కొత్తగా చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో చిరు బర్త్ డే కూడా తొందరలోనే రానుంది కనుక ఫ్యాన్స్ కూడా ఇప్పటినుండే హడావుడి మొదలుపెట్టారు. ఇప్పటి నుంచే చిరు అభిమానులు సోషల్ మీడియాలో వేడుకలకు తెరలేపేశారు. ఇప్పటికే కొంతమంది అభిమానులు చిరంజీవికి ప్రత్యెక ర్యాంప్ పాటను కానుకగా ఇవ్వాలని సిద్ధం అవుతున్నారు. ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ పేరిట దీన్ని రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు 65 ఇండియన్ ఫిలిం స్టార్స్ తో చిరు కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆగష్ట్ 21న ఈ కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. మమ్ముట్టి, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, సునీల్ శెట్టి, బొమన్ ఇరాని, సుదీప్, వెంకటేష్ ఇలా పలువురు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. దీనితోపాటు కామన్ డిస్ప్లే పిక్చర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ కామన్ డిస్ప్లే పిక్చర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధింది పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆగష్ట్ 21న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు కామన్ డిస్ప్లే పిక్చర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా కామన్ డీపీ ని ట్రెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూద్దాం మరి ఈ డీపీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో..

కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − sixteen =