తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ” వెబ్ సిరీస్ లో నటించిన సమంత, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో గెస్ట్ రోల్ లో నటించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ న్యాచురల్ డ్రామా “సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బంగార్రాజు పాత్రలో నాగార్జున అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు”సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” రూపొందనుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి నటించనుండగా , స్టార్ హీరోయిన్ సమంత ఒక కీలక పాత్రలో గెస్ట్ రోల్ లో నటించనున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: