‘శతమానం భవతి’ సినిమాతో నేషనల్ జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఇప్పుడు కుర్ర హీరోలతో మరో కొత్త సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఒక హీరోగా శ్రీహరి తనయుడు మేఘాంష్ కాగా మరో హీరోగా సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్నను హీరోగా పరిచయం చేయనున్నారు. ఇంతవరకూ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ విలువలతో సినిమాలు తీసిన సతీష్ వేగ్నేశ ఇప్పుడు ఈ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ చిత్రం తెరకెక్కించబోతున్నారు. దివంగత శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే చేసాను. ఇప్పుడు ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం చేయలనుకుంటున్నా… ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. అన్ని పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం” అని తెలిపారు.
నిర్మాత ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ.. సతీష్ గారు తీసిన ‘శతమానం భవతి’ సినిమా నా మనసుకి బాగా నచ్చింది. ఇప్పుడు ఆయనతో మూవీ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీ నటులు సాంకేతికనిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని వివరించారు.
కాగా అర్జున్-కార్తీక్ దర్శకత్వంలో ‘రాజ్ దూత్’ సినిమాతో మేఘాంష్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేకపోయింది కానీ హీరో గా మేఘాంష్ కు మాత్రం మంచి ప్రశంసలే దక్కాయి. మరి సమీర్ కు ఇది మొదటి సినిమా. చూద్దాం తను ఎంతవరకూ ఆకట్టుకుంటాడో.. ఈ సినిమా ఎలా వుండబోతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: