రజినీకాంత్ మొదటి తెలుగు సినిమా ఏంటో మీకు తెలుసా..?

Did You Know? This is the First Telugu Movie Of Rajinikanth

నీ నడకల స్టైయిలదిరే.. నీ నవ్వుల కైపదిరే.. నీ మాటల తీరదిరే.. నీ చూపుకు ఎద అదిరే అంటూ బాషా
సినిమాలో నగ్మా రజినీని ఊహించుకుంటూ పాట పడుతుంది. ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్‌ స్టయిలులే..’ ఈ పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఆ పాటకు తగ్గట్టే రజనీ ఏం చేసినా అది స్టయిలే. ఆ నడకలో ఓ స్టయిల్‌… సిగిరెట్‌ ఎగరేయడం ఓ స్టయిల్‌… కూలింగ్‌ గ్లాస్‌ని కూల్‌గా ఎగరేయడం ఓ స్టయిల్ ఇలా చేయడం ఆయనకు మాత్రమే సాటి. ఆ స్టయిల్ నచ్చే కదా సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. తమిళ్, తెలుగు, హిందీ ఒక్క భాష కాదు.. ఒక్క దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు. ఆ హీరో ఎవరో ఈ పాటికే అర్దమైఉంటది. తలైవా రజినీ కాంత్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు బాలచందర్‌ పరిచయం చేసిన ఎంతో మంది గొప్ప నటుల్లో రజినీ ఒకరు. కె. బాల చందర్‌ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్‌. మొదటి సినిమాతోనే అందరికీ రిజిస్టర్ అయిపోయాడు రజినీ. వెంటనే తెలుగు చిత్రం ‘అంతులేని కథ’కి రజనీని తీసుకున్నారు బాలచందర్. అయితే రజినీ తెలుగులో మొదటి సినిమా అంటే మనకు వెంటనే ‘అంతులేని కథ’ సినిమానే గుర్తొస్తుంది. కానీ రజినీకాంత్ తెలుగులో చేసిన మొదటి సినిమా’ చిలకమ్మ చెప్పింది’. ‘చిలకమ్మ చెప్పింది’ సినిమాలో హీరోగా తొలిసారి పూర్తిస్థాయి లీడ్‌ రోల్‌ లో నటించారు రజనీ. ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ పాజిటివ్ హీరో రోల్లో రజనీకాంత్ కెరీర్ ను టర్న్ చేసింది ఈ సినిమా. ఏరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్, సుప్రియ, సంగీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఏం.ఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు. ఇక ఈసినిమాకు నంది అవార్డ్ ను కూడా దక్కించుకుంది.

ఇక అలా మొదలైన రజినీ సినీ ప్రయాణంలో తమిళ, కన్నడ, హిందీ, తెలుగుల్లో అనేకమంది కథానాయకులతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. హాలీవుడ్ సినిమాలో నటించిన ఘనత కూడా రజినీకాంత్ సొంతం. ఇక అవార్డ్స్ గురించి చెప్పేదేముంది. రజినీకాంత్ సినీకెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తమిళ్‌లో ఆరు సార్లు ఉత్తమ నటుడి అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, కేంద్రం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.

ఈ ఏడాది ‘దర్బార్’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. ప్రస్తుతం తను అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ,మీనా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో…. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.